సోషల్ మీడియాలో(Social Media) హైప్ కోసం కొందరు యువకులు బైక్‌ల(Bike) పై భయంకరమైన ఫీట్స్(stunts) చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించిన ఈ బైక్ చోదకుల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా ఇలాంటిదే ఒకటి హైదరాబాద్‌లో(Hyderabad) వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్(Secretariat) ఎదుట, సిటీలోని పలు రోడ్లపై ఓ యువకుడు రెచ్చిపోయాడు. సాధారణ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ బైక్‌లపై విచిత్ర విన్యాసాలు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

హైదరాబాద్‌లో ఓ యువకుడు మరోసారి రెచ్చిపోయాడు. బైక్ విన్యాసాలను(Bike stunts) అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కానీ ఇవి నిత్యకృత్యంలా మారిపోయాయి. హైదరాబాద్‌లో ఇటీవల నిర్మించిన సెక్రటేరియెట్, స్టీల్ బ్రిడ్జి పరిసరాల్లో TS 13 EC 6234 నెంబర్ కలిగి ఉన్న బైక్‌పై ఓ యువకుడు విన్యాసాలు చేశాడు. ఈ విన్యాసాలను సోషల్ మీడియాలో(Social media) పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఓ నెటిజన్ లోకేంద్రసింగ్(Lokendra Sign) ట్విట్టర్‌లో(Twitter) హైదరాబాద్ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు, రోడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బైక్ నెంబర్, బైక్ కంపెనీ డీటెయిల్స్ కూడా ట్యాగ్ చేశాడు. సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసేలా ఈ విన్యాసాలు ఉన్నాయని, ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొద్ది సేపట్లోనే ఈ వీడియో వైరలైంది. ఈ బైక్ విన్యాసాలపై పోలీసులు స్పందించారు. యువకుడికి కోసం గాలిస్తున్నామని.. అతి త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.