Mammootty 'Kaathal' banned : మమ్ముట్టి సినిమాను నిషేధించిన ఆ రెండు దేశాలు... కారణమేమిటో తెలుసా?
మమ్ముట్టి-జ్యోతిక (Mammootty, Jyothika) ప్రధాన పాత్రల్లో నటించిన కాథల్ (Kaathal)- ది కోర్ సినిమాపై రెండు దేశాలు నిషేధం విధించాయి. ఈ నెల 23వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కువైట్, ఖతార్ (Kuwait and Qatar) దేశాల్లో మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. జీయో బేబీ (Jeo Baby) దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆ రెండు దేశాలు బ్యాన్ (Ban) చేశాయి. అందుకు కారణం ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండటమే
మమ్ముట్టి-జ్యోతిక (Mammootty, Jyothika) ప్రధాన పాత్రల్లో నటించిన కాథల్ (Kaathal)- ది కోర్ సినిమాపై రెండు దేశాలు నిషేధం విధించాయి. ఈ నెల 23వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కువైట్, ఖతార్ (Kuwait and Qatar) దేశాల్లో మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. జీయో బేబీ (Jeo Baby) దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆ రెండు దేశాలు బ్యాన్ (Ban) చేశాయి. అందుకు కారణం ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండటమే! ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో(Inernational film festival of kerala) ప్రదర్శించనున్న ఈ సినిమా స్టోరీ రివీల్ అయ్యింది. స్థూలంగా కథేమిటంటే రిటైర్ ఉద్యోగి (Retired employee) జార్జ్ (George) (మమ్ముట్టి), తన భార్య ఓమన (జ్యోతిక)తో కలిసి నివసిస్తుంటాడు. పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) పోటీ చేయాలని నామినేషన్ వేస్తాడు. ఇది జరిగిన రెండు రోజులకు భర్త నుంచి విడాకులు (Divorce) కోరుతో ఓమన న్యాయస్థానాన్ని (Court) ఆశ్రయిస్తుంది. అదే ఊళ్లో డ్రైవింగ్ స్కూల్ (Driving School)నడుపుతున్న ఓ వ్యక్తితో జార్జ్ స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడన్నది ఓమన ఆరోపణ. అయితే జార్జ్ లైంగికధోరణిని తాను నేరంగా చూడటం లేదని, కేవలం విడాకులు మాత్రమే తాను కోరుకుంటున్నానని అంటుంది. అయితే ఓమన ఆరోపణలను జార్జ్ ఖండిస్తాడు. తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరి (Story). జార్జ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా? ఓమనకు విడాకులు వస్తాయా? ఓమన ఆరోపణల్లో నిజం ఉందా? సినిమా చూస్తే కానీ తెలియదు. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ఏ విధంగా రియాక్టవుతుందన్నది సినిమాలో చూపించామని దర్శకుడు జీయో బేబి చెబుతున్నాడు. మమ్ముట్టితో జ్యోతిక నటించడం ఇదే మొదటిసారి. అందుకే సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. మమ్ముట్టి ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారని, ఆయనతో కలిసి నటించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని జ్యోతిక తెలిపారు.