ఒక్కోసారి దంపతుల మధ్య అకారణం గా మనస్పర్థలు వస్తూ ఉంటాయి . దీనికి మీ బెడ్ రూమ్ వాస్తు కూడాకారణం కావచ్చు .అవును ఇంటి నిర్మాణంలో వాస్తుకి ఉన్న ప్రాధాన్యత మనకు తెల్సిందే .అలంకరణ లో భాగంగా మనం చేసే పొరపాట్లు అదనం గా చేర్చే వస్తువుల వల్ల కొన్ని సార్లు మనకు తెలియకుండానే చికాకులు వస్తూ ఉంటాయి.అవి వ్యక్తిగత జీవితాలమీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి . అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే వాస్తు శాస్త్ర […]

ఒక్కోసారి దంపతుల మధ్య అకారణం గా మనస్పర్థలు వస్తూ ఉంటాయి . దీనికి మీ బెడ్ రూమ్ వాస్తు కూడాకారణం కావచ్చు .అవును ఇంటి నిర్మాణంలో వాస్తుకి ఉన్న ప్రాధాన్యత మనకు తెల్సిందే .అలంకరణ లో భాగంగా మనం చేసే పొరపాట్లు అదనం గా చేర్చే వస్తువుల వల్ల కొన్ని సార్లు మనకు తెలియకుండానే చికాకులు వస్తూ ఉంటాయి.అవి వ్యక్తిగత జీవితాలమీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి . అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే వాస్తు శాస్త్ర ప్రకారం పడక గది ఎలా వుంటే మంచిది .ఎలాంటి వస్తువులు ఉంచాలి అనే విషయాలను ఇప్పుడు తెల్సుకుందాం .

ఇంట్లో పడక గది అనేది నైరుతి మూల లో ఉండాలి . అలాగే మనం నిదురించే దిశా తూర్పు వైపు కానీ ,దక్షిణ ముఖం వైపు కానీ ఉండాలి . అలాగే మంచం చుట్టూ ఉండే ప్రదేశం విశాలం గా ఉండేటట్లు చూసుకోవటం కూడా ముఖ్యమే. మంచం నుండి మనం ఎటు వైపు దిగుతున్నాము అనేది కూడా ముఖ్యమే .ఇవన్నీ ఇంటి యజమాని మీద ప్రభావాన్ని చూపిస్తాయి . వార్డ్ రోబ్ లు వాయవ్య'దిశగా ఉంటడం అనుకూలం . బరువైన వస్తువులు నైరుతి దిశలో లేదా పశ్చిమ దక్షిణ దిశల్లో పెట్టాల్సి ఉంటుంది. బెడ్ రూమ్ లో మన మంచం అడ్డం లో కనిపించే విధం గా ఎక్కడ ఉండకూడదు. ఆలా అద్దం లో మంచం కనిపించటం అనేది నెగటివ్ ఎనర్జీ ని క్రియేట్ చేస్తుంది .

పడకగదిలో కిటికీ తప్పకుండ ఉండాలి ఆలా ఉన్నపుడు దంపతుల మధ్య శక్యత పెరిగేఅవకాశాలు మరింతగా బలపడతాయి. పడకగదిని వారానికి ఒకసారి ఉప్పు నీటితో శుభ్రం చేయటం వలన నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది . అలాగే బెడ్ రూమ్ లో దేవుని ఫొటోస్ అనేవి ఉండకపోవటం మంచిది . వాల్ పెయింటింగ్స్ మరేఇతర వస్తువులైనా ఆహ్లాదకరమైనవి ఉంచుకోవాలి . ఉద్రేకాన్ని ప్రతిబింబించేవి కానీ ,యుద్ధవాతావరణాన్ని తలపించేవి కానీ ,పరిగెడుతున్న గుర్రాలు బొమ్మలు లాంటివి ఉంటే ఇప్పుడే వాటిని తీసివేయండి .బెడ్ రూమ్ కి మనం వేసుకొనే రంగులు కూడా లేత రంగులు ఉండాలి .అవి కూడా వాస్తు ప్రకారం గా మనకు సమస్యలు తెచ్చే అవకాశం ఉన్నాయి . ఆగ్నేయ దిశలో ఉండే బెడ్ రూమ్ లో ఇంటి యజమాని నిద్రించకూడదు అది భార్య భర్తల మధ్య విపరీత మనస్పర్థలు కి దారి తీస్తుంది . చిందరవందరగా మీ పడక గది ని పెట్టకండి ఆలా చేస్తే మీకు ఎప్పుడు గొడవలు పెరుగుతూనే ఉంటాయి . వాస్తు ప్రకారం పడక గది సానుకూలం గా ఉంటే నే దంపుతుల మధ్య సానుకూలత పెరుగుతుంది . ఆహ్లదకరంగా తీర్చిదిద్దికోవటం ,మంచి సువాసన భరితంగా తెరిచి దిద్దటం అనేది మీ సంసారజీవితాలకి సంతోషకరం గా మారుతుంది.

Updated On 27 Feb 2023 7:22 AM GMT
Ehatv

Ehatv

Next Story