Madyapradesh:ఇద్దరు భార్యల విషయంలో మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు?.. ఆనందంతో ఇద్దరి భార్యలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త .!
ఇద్దరు భార్యలు ఒక భర్త కోసం తరచు గొడవలు పడుతున్న కేసు లో మధ్యప్రదేశ్ లో ఫ్యామిలి కోర్టు ఇచ్చిన తీర్పు విన్నాక ఆ భర్త ఇద్దరు భార్యాలకు ఊహించని బహుమతిని ఇచ్చాడు .అసలు ఎం జరిగిందంటే ?
ఇద్దరు భార్యలు ఒక భర్త కోసం తరచు గొడవలు పడుతున్న కేసు లో మధ్యప్రదేశ్ లో ఫ్యామిలి కోర్టు ఇచ్చిన తీర్పు విన్నాక ఆ భర్త ఇద్దరు భార్యాలకు ఊహించని బహుమతిని ఇచ్చాడు .అసలు ఎం జరిగిందంటే ?
గ్వాలియర్ కి చెందిన ఒక వ్యక్తి హరియానాకు చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు . 2018 లో ఇతనికి గ్వాలియర్ లో మహిళతో పెళ్లి అయింది. 2020 లొక్డౌన్ సమయంలో భార్యను పుట్టింటికి పంపించాడు. లొక్డౌన్ తీసేసిన 2 సంవత్సరాలు గడిచిపోతున్నా ఆమెను పుట్టింటి నుండి తీసుకెళ్లలేదు . హరియానాకు వెళిపోయాడు .
ఓపిక నశించిన భార్య హరియాణా వెళ్లి నేరుగా భర్తతోనే తేల్చుకోవాలని అనుకుంది. అక్కడ భర్త వేరే ఆమెతో కాపురం పెట్టడం చూసి షాక్ అయింది. సదరు వ్యక్తి అదే కంపెనీ లో పనిచేస్తున్న మరో యువతిని పెళ్లాడిన విషయం మొదటి భార్యకు తెల్సింది . తనకు న్యాయం చేయాలంటూ మొదటి భార్య గ్వాలియర్ లో ఫామిలీ కోర్టుని ఆశ్రయించింది . 6 నెలలపాటు కౌన్సిలింగ్ ఇచ్చి ముగ్గురితో చర్చలు జరిపింది కోర్టు . దీనితో వారం లో మొదటి మూడురోజులు ఒకభార్య దగ్గర తర్వాత 3 రోజులు మరో భార్య దగ్గర ఆదివారం.భర్త ఇష్టప్రకారం ఎవరిదగ్గరైన ఉండచ్చు అంటూ సమ న్యాయాన్ని ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ను ఇద్దరు భార్యలు ఇష్టపూర్వకంగా స్వీకరించారించారు .
తన ఇద్దరు భార్యలు సఖ్యతతో తీర్పుని అంగీకరించిన సందర్భంలో ఆ భర్త ఇద్దరు భార్యలకు రెండు ఫ్లాట్ లను కొనుగోలుచేసి ఇద్దరికీ బహుమతిగా ఇవ్వటం జరిగింది .