సోషల్‌ మీడియా(Social Media) విస్తృతమయ్యాక రకరకాల ట్రెండులు(Trends) పుట్టుకొస్తున్నాయి. కొన్ని వింతగా విడ్డూరంగా అనిపించినా, కొన్ని మాత్రం ఇవేవో బాగానే ఉన్నాయేననిపిస్తున్నాయి. ఆ మధ్య క్వైట్ క్విట్టింగ్‌(Quiet Quitting) అంటూ జెన్‌ జడ్‌ వ్యక్తులు చేసిన ట్రెండ్‌ సంగతి తెలిసిందే కదా! వృత్తి జీవితంలో తన పని వరకు మాత్రమే పరిమితం కావడాన్ని క్వైట్‌ క్విట్టింగ్‌ అంటారు.

సోషల్‌ మీడియా(Social Media) విస్తృతమయ్యాక రకరకాల ట్రెండులు(Trends) పుట్టుకొస్తున్నాయి. కొన్ని వింతగా విడ్డూరంగా అనిపించినా, కొన్ని మాత్రం ఇవేవో బాగానే ఉన్నాయేననిపిస్తున్నాయి. ఆ మధ్య క్వైట్ క్విట్టింగ్‌(Quiet Quitting) అంటూ జెన్‌ జడ్‌ వ్యక్తులు చేసిన ట్రెండ్‌ సంగతి తెలిసిందే కదా! వృత్తి జీవితంలో తన పని వరకు మాత్రమే పరిమితం కావడాన్ని క్వైట్‌ క్విట్టింగ్‌ అంటారు. అలాగే చాలా మంది సోమవారం వస్తుందంటే చాలు నీరసపడిపోతుంటారు. వీరి కోసమే అన్నట్టుగా బేర్‌ మినిమమ్‌ మండేస్‌(Bear Minimum Mondays) అంటూ కొత్త ట్రెండ్‌ను తెరమీదకు తెచ్చారు. అంటే సోమవారాలు పెద్దగా పనులు పెట్టుకోకపోవడమన్నమాట! లేటెస్ట్‌గా సైలెంట్‌ వాకింగ్‌(Silent Walking) అనే ట్రెండ్‌ మొదలయ్యింది. అంటే టెక్నాలజీకి దూరంగా ఉండి నడక సాగించడం.. బాగానే ఉంది కదూ! అసలు దీని కథమిటో తెలుసుకుందాం! ఈ సైలెంట్‌ వాకింగ్‌ సృష్టికర్త అమెరికాకు చెందిన మ్యాడీ మే(Maddie May) అనే పాడ్‌కాస్టర్‌. ఈ ఆలోచన ఈయనకు వచ్చిందేమీ కాదు. వాకింగ్‌ చేసేటప్పుడు టెక్నాలజీకి దూరంగా ఉండాలని ఆయన భార్య చెప్పిందట! ఎయిర్‌పాడ్స్‌(Airpods), పాడ్‌కాస్ట్‌లు(Podcasts), మ్యాజిక్‌(Music) వంటి వాటికి దూరంగా ఉండటమన్నమాట! మొదట్లో ఇలా నడవడం కొంచెం కష్టంగానే అనిపించినా రాన్రాను ఆయనకు అలవాటయ్యిందట! ఇది తన టిక్‌టాక్‌ వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటికే 5 లక్షల మందికిపైగా ఈ వీడియోను చూశారు. 'సైలెంట్ వాకింగ్‌లో తొలి రెండు నిమిషాల నడక కాస్త అయోమయంగా అనిపించినా కాసేపయ్యాక మీకు అర్థమవుతుంది. విశ్వం, మీ గుండెలోతుల్లోంచి నుంచి కొన్ని గుసగుసలు మీకు వినిపిస్తాయి. కాబట్టి ఒంటరిగా ఉండండి. ఒంటరిగా నడవడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి. టెక్నాలజీని దూరం పెట్టడం ద్వారా మెదడుకు అందుకు కావాల్సిన స్థలం ఇస్తున్నాం. నిశ్శబ్దంగా నడవడం వల్ల ప్రతిదీ వినగగులుతున్నాను, ఆస్వాదించగలగుతున్నాను. ప్రతిదీ చూడగలుగుతున్నాను. నేను ప్రయత్నించాను. వీలైతే మీరూ చేయండి’ అని మ్యాడీ మే తెలిపారు.

Updated On 16 Oct 2023 6:42 AM GMT
Ehatv

Ehatv

Next Story