మద్రాస్‌ హైకోర్టు (madras high court)ఇచ్చిన ఆదేశాలతో స్టార్‌ హీరో విశాల్‌(hero vishal) కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్‌ అయ్యింది. 15 కోట్ల రూపాయల శాశ్వత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని విశాల్‌ను ఆదేశించిన న్యాయస్థానం అందుకోసం మూడు వారాల గడువు ఇచ్చింది. ఒకవేళ మూడువారాల్లో డబ్బును డిపాజిట్‌ చేయకపోతే విశాల్‌ సొంత నిర్మాణ సంస్థ అయిన ఫిలిం ఫ్యాక్టరీ నిర్మించే సినిమాలు విడుదల కాకుండా నిషేధం విధించింది. అసలేం జరిగిందంటే. చాన్నాళ్ల కిందట విశాల్‌ తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ (film factory) కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ దగ్గర 21.29 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు

మద్రాస్‌ హైకోర్టు (madras high court)ఇచ్చిన ఆదేశాలతో స్టార్‌ హీరో విశాల్‌(hero vishal) కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్‌ అయ్యింది. 15 కోట్ల రూపాయల శాశ్వత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని విశాల్‌ను ఆదేశించిన న్యాయస్థానం అందుకోసం మూడు వారాల గడువు ఇచ్చింది. ఒకవేళ మూడువారాల్లో డబ్బును డిపాజిట్‌ చేయకపోతే విశాల్‌ సొంత నిర్మాణ సంస్థ అయిన ఫిలిం ఫ్యాక్టరీ నిర్మించే సినిమాలు విడుదల కాకుండా నిషేధం విధించింది. అసలేం జరిగిందంటే. చాన్నాళ్ల కిందట విశాల్‌ తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ (film factory) కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ దగ్గర 21.29 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించలేని స్థితిలో విశాల్‌ ఉన్నప్పుడు లైకా ప్రొడక్షన్స్‌ (lyca productions) ఆదుకున్నది. ఈ రుణాన్ని ఫైనాన్షియర్‌కు లైకా ప్రొడక్షన్స్‌ తిగిరి ఇచ్చేసింది. అయితే తమకు ఆ రుణం చెల్లించేంత వరకు విశాల్‌ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇవ్వాలని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీతో లైకా ప్రొడక్షన్స్‌ ఓ ఒప్పందం చేసుకుంది. అయితే విశాల్‌ మాత్రం ఒప్పందానికి తూట్లు పెట్టాడు. తన చిత్రం 'వీరమే వాగై సూడుం'ను విడుదల చేశాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్‌ స్పెషల్ కోర్టు రిజిస్ట్రార్‌ పేరుతో 15 కోట్ల రూపాయలను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. విచారణ సమయంలో విశాల్‌ కోర్టుకు హాజరయ్యాడు. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వల్లే అప్పు కట్టలేకపోయానని, తనకు ఒకే రోజున 18 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని న్యాయస్థానానికి తెలిపాడు. అయితే కోర్టు ఊరుకుంటుందా? ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేశాడు విశాల్‌.. అక్కడా చుక్కెదురయ్యింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజా, జస్టిస్‌ భరత్‌ చక్రవర్తిల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 15 కోట్ల రూపాయలను విశాల్‌ చెల్లించాలంటూ గతంలో సింగిల్‌ స్పెషల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. పైగా స్పెషల్‌ జడ్జ్‌ తుది తీర్పును చెప్పేంత వరకు విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు థియేటర్‌ లేదా ఓటీటీలో విడుదల చేయకూడదని ధర్మాసనం ఆదేశించింది.

Updated On 8 April 2023 12:15 AM GMT
Ehatv

Ehatv

Next Story