నేడు కిస్‌ డే (Kiss Day). ప్రేమికుల రోజు (Valentine's Day) కంటే ఒక రోజు వచ్చే రోజు అంటే ఫిబ్రవరి 13న కిస్ డే అంటారు. ఈరోజు ప్రేమికులు ఒకరికొకరు ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. ప్రేమించిన వారిని కిస్‌ చేసి తమ ప్రేమను వ్యక్త పరుస్తారట. వాలెంటైన్‌ వీక్‌లోకి కిస్‌ డే ఎలా వచ్చిందో తెలుసుకుందాం. 

కిస్​ డే.. ప్రేమికులను మరింత రొమాంటిక్‌గా మారుస్తుంది. ప్రేమ పక్షులు ఎదుటివారిపట్ల తమకున్న ప్రేమను, ఆప్యాయతను పంచుకునేందుకు ఇది దోహద పడుతుందని చెప్తారు. కిస్‌ డేకు 19వ శతాబ్దంలో (19th century) నాటి విక్టోరియన్ శకంలో అత్యంత ప్రాధాన్యత వచ్చిందని చెప్తారు. నిజానికి దీనికి చెప్పుకునేంత చరిత్ర ఏమీ లేదు. అంతకు ముందు బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసేవారట. అందుకే కిస్‌డేని సీక్రెట్‌గా చేసుకునేవారని చెబుతారు. వాలెంటైన్స్‌ డే అంత ప్రాచుర్యం పొందకపోయినా.. ఈ మధ్య కాలంలో కిస్‌డేను కూడా ఘనంగానే జరుపుకుంటున్నారట. ప్రేమలో పడిన తర్వాత ముందుగా కిస్‌తోనే రొమాన్స్‌ ప్రారంభిస్తారు. ఇది తమ రిలేషన్‌షిప్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంది.

ఇప్పుడు కిస్‌ డేను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుపుకుంటున్నారు. కొన్ని దేశాల్లో ఇందుకు సంబంధించిన ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తమకు నచ్చిన ప్రదేశాల్లో కూడా ప్రేమజంటలు ఏకాంతంగా గడుపుతాయి. ముద్దు పెట్టుకుంటే ప్రేమ, ఆప్యాయత, ఆనందంతో సహా ఎన్నో అనుభూతులను ఇస్తుంది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని మరింత ధృఢంగా మారుస్తుంది. ముద్దు తమ ప్రేమను పూర్తిగా వ్యక్త పరిచే అవకాశముంది. పాశ్చాత్య సంస్కృతి కావడంతో భారతదేశంలో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు.

Updated On 12 Feb 2024 11:29 PM GMT
Ehatv

Ehatv

Next Story