గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు(Guinness World Record) సాధించాలంటే సాహసాలు గట్రాలు చేయనక్కర్లేదు. ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పనిలేదు. చెమటోడాల్సిన అవసరం అంతకంటే లేదు.. కొన్నిసార్లు ఉత్తినే రికార్డులు వచ్చిపడుతుంటాయి.. మీసాలు గడ్డాలు పెంచేసి రికార్డులు కొట్టేస్తుంటారు కొందరు. గోళ్లను పెంచేసి రికార్డు బుక్కులోకి ఎక్కేస్తుంటారు ఇంకొందరు. మరికొందరు బారేడు పొడువు జుట్టును పెంచేసి అలా రికార్డు సృష్టిస్తుంటారు. లూసియానా(Louisiana)కు చెందిన 47 ఏళ్ల ఏవిన్‌ డుగాస్‌(Avin Dugas) ఇలాగే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు(Guinness World Record) సాధించాలంటే సాహసాలు గట్రాలు చేయనక్కర్లేదు. ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పనిలేదు. చెమటోడాల్సిన అవసరం అంతకంటే లేదు.. కొన్నిసార్లు ఉత్తినే రికార్డులు వచ్చిపడుతుంటాయి.. మీసాలు గడ్డాలు పెంచేసి రికార్డులు కొట్టేస్తుంటారు కొందరు. గోళ్లను పెంచేసి రికార్డు బుక్కులోకి ఎక్కేస్తుంటారు ఇంకొందరు. మరికొందరు బారేడు పొడువు జుట్టును పెంచేసి అలా రికార్డు సృష్టిస్తుంటారు. లూసియానా(Louisiana)కు చెందిన 47 ఏళ్ల ఏవిన్‌ డుగాస్‌(Avin Dugas) ఇలాగే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు పది అంగుళాలు పొడవు ఆఫ్రో హెయిర్‌స్టయిల్‌(Largest Afro Hairstyle)తో ఈమె పాపులరయ్యింది. ఈమె గిన్నిస్‌ రికార్డులు సాధించడం ఇదేం మొదటిసారి కాదు. 2010లోనూ నాలుగు ఫీట్ల జుట్టుతో రికార్డు సాధించింది. ఇప్పుడు ఆ జుట్టును మరింతగా పెంచేసింది. తన రికార్డును తానే బద్ధలు కొట్టుకుంది. గత 24 ఏళ్లుగా ఏవిన్‌ డుగాస్‌కు ఇదే పని.. అంటే జట్టును పెంచడమే పని.

మొదట్లో ఆమె జుట్టు కోసం కెమికల్స్‌ వాడేది. అందులో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తెలుసుకుని వాటి జోలికి వెళ్లడం మానేశారు. అప్పటి నుంచి ఆమె సహజ పద్ధతుల్లోనే జుట్టును పెంచుతూ వస్తోంది. అన్నట్టు తన జుట్టుకోసం ఓ హెయిర్‌ స్టైల్‌ డిజైనర్‌ను పెట్టుకుంది. ఆమె డ్యూటీ ఏమిటంటే అంచులు మాత్రమే కత్తిరించాలి. ఇంతేసి జట్టును మెయింటెనెన్స్‌ చేయడం కష్టమేనని అంటూనే, పేరు ప్రఖ్యాతులు వస్తున్నప్పుడు అదేం ఇబ్బంది అనిపించడం లేదని చెబుతోంది డుగాస్‌..

Updated On 6 April 2023 11:54 PM GMT
Ehatv

Ehatv

Next Story