3 ఏళ్ళ పాటు చైనా (china)లో కరోనా విజృభించిన సమయంలో చాలా సార్లు లాక్ డౌన్(lockdown) విధించటం వలనప్రజలు ఎక్కువుగా ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యేవాళ్లు చాలామంది తమ సన్నిహితులను మిస్ అయ్యేవాళ్ళు.దీనిని కనుగొన్న శాత్రవేత్త తన సొంత ఫీలింగ్ ను వినూత్నంగా ఆవిష్కరిస్తూ ఈ ముద్దు మెషిన్ ని(kissing machine) కనుకోవటం జరిగింది

లాక్‌డౌన్ ఐసోలేషన్‌తో ఒంటరితనంతో చాల మంది ప్రేమికులు దూరంగా ఉండే సందర్బాలు ఎదుర్కొన్నారు . ఈ విషయాన్నీ స్ఫూర్తిగా గ తీసుకున్న ఒక చైనీస్ స్టార్టప్ (Chinese startup)సుదూర ముద్దు యంత్రాన్ని కనిపెట్టింది, ఇది సిలికాన్ పెదవులలో (silicon Lips)దాగి ఉన్న మోషన్ సెన్సార్‌ల ద్వారా వినియోగదారుల ముద్దుల డేటాను (kissing data)సేకరిస్తుంది . అందుకున్న ముద్దులను రీప్లే చేసేటప్పుడు ఏకకాలంలో
డేటా కు అనుగుణంగా పెదవులను(lips) కదిలిస్తుంది.నిజ జీవితం లో ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అదే సౌండ్ వినపడుతుంది . మనము ఇచ్చే ముద్దు సౌండ్ (kiss sound)ని కనిపెట్టి దానికి అనుగుణంగా రీప్లే చేస్తుంది ఆ సమయం లో కొద్దిగా వేడెక్కుతుంది,దీని ద్వారా మనకు నిజంగా ముద్దు పెట్టుకొనే అనుభూతిని ఇస్తుందట .

3 ఏళ్ళ పాటు చైనా (china)లో కరోనా విజృభించిన సమయంలో చాలా సార్లు లాక్ డౌన్(lockdown) విధించటం వలనప్రజలు ఎక్కువుగా ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యేవాళ్లు చాలామంది తమ సన్నిహితులను మిస్ అయ్యేవాళ్ళు.దీనిని కనుగొన్న శాత్రవేత్త తన సొంత ఫీలింగ్ ను వినూత్నంగా ఆవిష్కరిస్తూ ఈ ముద్దు మెషిన్ ని(kissing machine) కనుకోవటం జరిగింది

"నేను అప్పటికి రిలేషన్ లో ఉన్నాను , కానీ లాక్‌డౌన్ల కారణంగా నేను నా స్నేహితురాలిని కలవలేకపోయాను" అని ఈ మెషిన్ కనుగొన్న జావో జియాన్బో చెప్పారు.బీజింగ్ ఫిల్మ్ అకాడమీలో ఒక విద్యార్థి, అతను వీడియో కాల్‌లలో శారీరక సాన్నిహిత్యం లేకపోవడంపై తన గ్రాడ్యుయేట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. తర్వాత అతను Siweifusheని స్థాపించాడు, ఆ తర్వాత MUA ని రిలీజ్ చేసాడు , MUA మొదటి ఉత్పత్తిని జనవరి 22న దాదాపు 260 యువాన్లు ($38) ధరతో విడుదల చేసింది అంటే ఇండియా ధరలో కేవలం దగ్గరగా 3,124వేల రూపాయలు .

విడుదలైన రెండు వారాల సమయంలోనే సంస్థ 3,000 కిస్సింగ్ మెషీన్‌లు అమ్ముడుపోయాయి అలాగే సుమారు 20,000 ఆర్డర్‌లను అందుకోవటం జరిగింది.

MUA ఒక మొబైల్ స్టాండ్‌ని పోలి ఉంటుంది, దాని ముందు మనిషిని పోలిన పెదవులు ఉంటాయి. దీన్ని ఉపయోగించడానికి, ప్రేమికులు తప్పనిసరిగా తమ స్మార్ట్‌ఫోన్‌లలో(smart phone) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో ప్లగ్ చేసే వారి ముద్దు మిషన్ యాడ్ చేయాలి. ఈ ఆప్(app) ని యూస్ చేసేందుకు డివైస్ ని ఆక్టివేట్(device activate) చేయాల్సి ఉంటుంది . ఆపై దానిని ముద్దాడినప్పుడు, అది తిరిగి ముద్దు పెట్టుకుంటుంది.

ఈ మిషన్ ఒకే యునిసెక్స్(Unisex) పెదవులతో అనేక రంగులలో అందుబాటులో ఉంది. కొంతమంది వినియోగదారులు ఇది చమత్కారంగా ఉందని చెప్పగా, మరికొందరు ఇది తమకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పారు. ఎక్కువమంది ఫిర్యాదులలో దాని నాలుక లేకపోవడం కూడా ఉంది . ఏది ఏమైనా ఈ ఆర్టిఫిషల్ కిస్సింగ్(artificial Kissing machine) మిషన్ దూరంగా ఉండే ప్రేమికుల ఒంటరితన్నాని కొంచెమైనా తగ్గిస్తుంది అనే వాదనలు వినపడుతున్నాయి .

Updated On 28 March 2023 1:20 AM GMT
rj sanju

rj sanju

Next Story