మధ్యం బాబులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక నుంచి హ్యాప్పీగా మందు ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా ఇంటికే తెచ్చుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చేస్తుంది . యూత్ వీకెండ్ ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూడటమే కాదు ... వీకెండ్ రోజు పార్టీలు ..పబ్బులు అంటూ చేసే హడావుడి అంతా ఇంతా కాదు . అయితే చాలామంది పార్టీలు ప్లాన్ చేసుకున్న అందరికి నచ్చిన బ్రాండ్స్ అందుబాటులో లేకున్న కష్టమే . మరోవైపు ఈ […]

మధ్యం బాబులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక నుంచి హ్యాప్పీగా మందు ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా ఇంటికే తెచ్చుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చేస్తుంది . యూత్ వీకెండ్ ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూడటమే కాదు ... వీకెండ్ రోజు పార్టీలు ..పబ్బులు అంటూ చేసే హడావుడి అంతా ఇంతా కాదు . అయితే చాలామంది పార్టీలు ప్లాన్ చేసుకున్న అందరికి నచ్చిన బ్రాండ్స్ అందుబాటులో లేకున్న కష్టమే . మరోవైపు ఈ మధ్య యువత పబ్బులు, బార్ల కంటే ..సిటీ అవుట్ కట్స్ లేదా ఏదైనా ఒక్క ప్లేస్ లో గాదర్ అయి వీకెండ్ లేదా సందర్బాన్ని బట్టి పార్టీలు చేసుకోవడానికి యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ పబ్‌ గోయర్లను ఆకట్టుకోవడం కోసం హైదరాబాద్‌లో తమ డిస్కౌంటెడ్‌ ప్రీ పెయిడ్‌ పెగ్‌ కాన్సెప్ట్‌ ను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. . హైదరాబాద్‌లో ‘పెగ్’ బూజీ హోం డెలివరీ తో ఇంటికే 10నిమిషాల్లో మద్యం డెలివరీ కానుంది. ఇక మద్యం ప్రియులు.. ఇంటివద్దకే చక్కగా లిక్కర్‌ను బుక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. పెగ్ బూజీ హోం డెలివరీ ఇప్పుడు సిటీలోకి ఎంట్రీ కానుంది.దీని కాన్సెప్ట్ ఏంటంటే తమకు దగ్గరలోని పలు బార్ల నుంచి 30 మిల్లీ లీటర్ల పెగ్‌లను బూజీ యాప్‌పై భారీ డిస్కౌంట్‌ ధరకు బుక్‌ చేసుకోవచ్చు. బార్లు, పబ్‌ల వద్ద తన సొంత అనుభవాలతోనే దీనిని తీసుకువచ్చామన్నారు బూజీ ఫౌండర్‌, సీఈఓ, వివేకానంద్‌ బలిజెపల్లి... ఏ పబ్‌కు వెళ్లాలనేది ఎప్పుడూ డైలమాగానే ఉంటుందని, అన్నీ ఒకే చోట లభించి, నచ్చినట్లు పార్టీ చేసుకోలేమా అదీ కోరుకునే డీల్స్‌ పొందుతూ అనే భావనతోనే ప్రీ పెయిడ్‌ పెగ్‌ (పీపీపీ) కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశామన్నారు.

అయితే ఈ కాన్సెప్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు. యుఎస్‌ఏలో అయితే దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. దీనిలో వినియోగదారునికి వర్ట్యువల్‌ బాటిల్‌ అందుబాటులో ఉంటుందన్నారు. దీంతో పాటుగా సామాజిక మాధ్యమ వేదికలు మిళితమై ఉంటాయన్నారు. బార్లు, పబ్‌ల నుంచి రెస్పాన్స్ రావడంతో వివేక్‌ ఈ మోడల్‌తో ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారని చెప్పుకొచ్చారు.. ఇప్పుడు అధిక శాతం మంది చక్కటి నైట్‌ ఔట్‌ పార్టీలను కోరుకుంటున్నారన్నారు. ఈ పీపీపీ మోడల్‌తో అతి తక్కువ ధరలోనే పార్టీ చేసుకోవచ్చన్నారు. డైన్‌ఔట్స్‌, జొమాటోలలో డిస్కౌంటెడ్‌ మోడల్స్‌ ఉన్నా అక్కడ బార్లు, పబ్‌లు ఖచ్చితమైన అమ్మకాల భరోసా లేకుండా రాయితీలు ఇస్తాయన్నారు. కానీ ఇక్కడ తాము ముందుగానే చెల్లింపులు చేస్తామని, కాబట్టి స్పందన కూడా అద్భుతంగా ఉందన్నారు.

Updated On 7 March 2023 1:16 AM GMT
Ehatv

Ehatv

Next Story