మృత్యువుకు ఎదురెళ్లి స్వాగతం పలికెంతటి దమ్ము ధైర్యం ఎవరికీ ఉండవు. మరణం(Death) అంటే చాలా మందికి భయం. ఫలానా రోజును చచ్చిపోతావని ఎవరైనా చెప్పారే అనుకోండి.. అప్పట్నుంచి చావు వచ్చేంత వరకు ప్రతి రోజూ మరణమే! ఇప్పటి వరకు మరణ తేదీని పెద్ద పెద్ద జ్యోతిష్కులు కూడా చెప్పలేకపోయారు. అందుకే కదా వాన రాకక ప్రాణం పోకడ అనే నానుడి పుట్టింది. శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో వాన ఎప్పుడొస్తుందో తెలుసుకోగలుగుతున్నాం కానీ ప్రాణం పోకడనే కచ్చితంగా తెలుసుకోలేకపోతున్నాం.

మృత్యువుకు ఎదురెళ్లి స్వాగతం పలికెంతటి దమ్ము ధైర్యం ఎవరికీ ఉండవు. మరణం(Death) అంటే చాలా మందికి భయం. ఫలానా రోజును చచ్చిపోతావని ఎవరైనా చెప్పారే అనుకోండి.. అప్పట్నుంచి చావు వచ్చేంత వరకు ప్రతి రోజూ మరణమే! ఇప్పటి వరకు మరణ తేదీని పెద్ద పెద్ద జ్యోతిష్కులు కూడా చెప్పలేకపోయారు. అందుకే కదా వాన రాకక ప్రాణం పోకడ అనే నానుడి పుట్టింది. శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో వాన ఎప్పుడొస్తుందో తెలుసుకోగలుగుతున్నాం కానీ ప్రాణం పోకడనే కచ్చితంగా తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఇప్పుడొచ్చిన లేటెస్ట్‌ టెక్నాలజీ(Latest Technology) తో అది కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)టెక్నాలజీ తెలుసు కదా! ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా విన్నా ఏఐ టాపిక్కే వినిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం చాట్‌జీపీటీ. ఇప్పుడు ఏఐని ఉపయోగించి మనిషి చావు గురించి కూడా ముందే తెలుసుకోవచ్చట! మనిషి మరణంపై ఏఐ చెప్పింది 78 శాతం కరెక్టయ్యిందట! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ సాయంతో శాస్త్రవేత్తలు ఓ అల్గారిథమ్‌ను తయారుచేశారు. దాని ఆధారంగా వారు ఎలా జీవిస్తారు , ఎలా చనిపోతాడు అనే అంశం గురించి అంచనా వేస్తున్నారు. సైంటిస్ట్‌లు ఓ ఏఐ ఆధారిత మోడల్‌ను తయారు చేశారు. చాట్‌జీపీటీ, బింగ్‌ ఏఐ, గూగుల్‌ బార్డ్‌ తరహాలో లైఫ్‌2వీఈసీ (life2vec) పేరుతో పిలిచే ఈ కృత్తిమ మేధ మృత్యువు ఎప్పుడు ముంచుకొస్తుందో ముందే పసిగట్టేస్తుంది. మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌లో శిక్షణ పొందిన టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ (DTU), అమెరికా రిసెర్చర్లు ఏఐ ఆధారిత డెత్‌ ప్రిడెక్టర్‌ను అభివృద్ధి చేశారు. అనంతరం సుమారు 6 లక్షల మంది ఆదాయం,వృత్తి, పుట్టిన ప్లేస్‌, రోడ్డు ప్రమాదాలు ఏమైనా జరిగాయా? ప్రెగ్నెన్సీ హిస్టరీ ఇలా రకరకాలుగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అనంతరం వారి మరణంపై అంచనాల్ని వెలుగులోకి తెచ్చింది. వారిలో కొందరు త్వరగా చనిపోతారని అంచనా వేసింది. ఎక్కువగా మగవారే త్వరగా చనిపోతారని ఏఐ అంచనా వేసింది. ఈ లైఫ్‌2వీఈసీ మోడల్‌కు 2008 నుంచి 2016 వరకు డేటాపై శిక్షణ ఇచ్చారు. జనాభా డేటా ఆధారంగా ముందుగా అంచనా వేసినట్లుగానే 2020 నాటికి మూడు శాతం కంటే ఎవరు మరణించారో సరిగ్గా అంచనా వేసింది.

Updated On 23 Dec 2023 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story