ఈ కాలం రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు.. సిగ్గు అంతకన్నా లేదు.. అధికారం ఎటుంటే అటు.. రయ్యిన ఉరకడమే నేతల (Leaders) పని.. ఈ సమయంలో ఊసరవెల్లిలను (chameleon) మనం తిట్టకూడదబ్బా.. అవి సహజసిద్ధంగా రంగులు మారుస్తాయేమో కానీ.. మన రాజకీయనేతలు మాత్రం స్వార్థం కోసం రంగులు మారుతారు. ఈ జంపింగ్‌ జపాంగ్‌లను చూస్తే ఇప్పుడు ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయి. వార్నీ ఈ రాజకీయ నేతల్లో నా కంటే ఎక్కువ షేడ్స్‌ ఉన్నాయిరా.. అని ఊసరవెల్లులు అనుకుంటుండొచ్చు.

ఈ కాలం రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు.. సిగ్గు అంతకన్నా లేదు.. అధికారం ఎటుంటే అటు.. రయ్యిన ఉరకడమే నేతల (Leaders) పని.. ఈ సమయంలో ఊసరవెల్లిలను (chameleon) మనం తిట్టకూడదబ్బా.. అవి సహజసిద్ధంగా రంగులు మారుస్తాయేమో కానీ.. మన రాజకీయనేతలు మాత్రం స్వార్థం కోసం రంగులు మారుతారు. ఈ జంపింగ్‌ జపాంగ్‌లను చూస్తే ఇప్పుడు ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయి. వార్నీ ఈ రాజకీయ నేతల్లో నా కంటే ఎక్కువ షేడ్స్‌ ఉన్నాయిరా.. అని ఊసరవెల్లులు అనుకుంటుండొచ్చు. మన నేతలు ఉదయం ఓ పార్టీ.. సాయంత్రం మరో పార్టీలో చేరిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే కొందరు నాయకులు కండువాలు మార్చుతున్నారు. అధికార పార్టీలో ఉండి అడ్డగోలుగా సంపాదిస్తారు.. ఆ సంపాదనను కాపాడుకునేందుకు అధికారంలోకి వచ్చిన పార్టీలకు వెళ్తే తమ ఆస్తులు సేఫ్‌ అని భావిస్తారు. అప్పటివరకు అధికార హోదాను అనుభవించిన నేతలు.. మరోసారి అధికారం కోసం అర్రులు చాస్తూ.. గోడలు దూకేస్తారు.

ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పరిగెత్తడం నేటి నేతలకు అలవాటుగా మారింది. ఒకప్పుడు రాజకీయనేతలంటే సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వారు. పార్టీ గీత దాటకపోయేవారు కాదు. రానురాను ఈ సిద్ధాంతాలను, కట్టుబాట్లను గంగలో కలిపేశారు. సిగ్గూ.. ఎగ్గూ ఏ మాత్రం లేకుండా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్‌ అవుతున్నారు. ఈ పార్టీ.. ఆ పార్టీ అని లేదు.. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రమని లేదు.. అధికారమే పరమావధిగా బతికే కొందరు... కాదు కాదు.. కొందరేంది.. చాలా మందే.. స్వార్థ ప్రయోజనాల కోసం, ఆస్తులు కాపాడుకునేందుకు గోడలు దూకడం పరిపాటి అయింది. అప్పటివరకు తామున్న పార్టీలను ఆహా.. ఓహో.. మా పార్టీ గొప్పదంటే మా పార్టీ గొప్పదని గొంతు చించుకున్న నేతలు.. మా నాయకుడు ఆరుడు, వీరుడు, ధీరుడు, శూరుడు అన్న నోళ్లే.. అధికారం దక్కకపోయే సరికి కుక్కమూతి పిందెల్లా కుయ్‌మనకుండా ఇతర పార్టీలకు ఎగిరిపోతున్నారు. మెడలో టవల్‌ను తీసి పక్కన పడేసినంత ఈజీగా తమ మెడలోని పార్టీల కండువాలను (Party flags) తీసి రోడ్డుపై పడేసి తొక్కి మరీ పక్కపార్టీల కండువాలను కప్పేసుకుంటున్నారు. గతంలో తాము ఇతర పార్టీలను, ఇతర పార్టీల నేతలను ఎలా విమర్శించామన్న సోయి కూడా ఉండడం లేదు. ఆ ఏముందిలే జనాలకు షార్ట్‌ మెమరీ ఉంటది. నాలుగు రోజులు పోతే వాళ్లే అంతా మర్చిపోతారన్న ధీమాతో గోడలు దూకేస్తారు. రాజకీయాలంటే ఇలానే ఉంటాయన్నసందేశాన్ని భావి తరాలకు ఇప్పటి నేతలు పంపిస్తున్నారు. అంతేలే ఈరోజుల్లో "జంపింగ్‌ జపాంగ్‌లదే రాజ్యం మరి"..!

Updated On 15 March 2024 6:47 AM GMT
Ehatv

Ehatv

Next Story