Korean boy tries pani puri :పానీ పూరీ ట్రై చేసిన కొరియన్ యూట్యూబర్!
ఈ కొరియన్ యూట్యూబర్ భారత్‌లో తన అనుభవాలను(experiences) లడ్కా షార్ట్ వీడియోల ద్వారా ప్రపంచాని(country )కి చేరవేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రాం (Instagram)లో ఇటీవల అతడు పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
పానీ పూరి అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరేమో . చిన్న పిల్లల నుంచి మొదలు పెద్దవాళ్ల వరకు ఈ పానీపూరీని ఇష్టంగా ఆరగిస్తారు . ఈ టేస్ట్ మన వాళ్ల వరకే పరిమితము అనుకుంటే పొరపాటే ...ఈ పానీపూరీని వేరే రాష్ట్రాల వారే కాదు ...వేరే దేశాల ప్రముఖులు కూడా లొట్టలు వేసుకుంటూ ఇష్టంగా తింటున్నారు. అంతలా మన స్ట్రీట్‌ఫుడ్ పానీపూరీ తెగ నచ్చేసింది అన్నమాట ... అంతేకాదండోయో రీసెంట్ గా మన ప్రధాని మోదీ ...జపాన్ ప్రధాని వీరిద్దరు కూడా సరదాగా పానీ పూరీ ( pani puri)టేస్ట్ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే . అయితే జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదా ( Fumio Kishida)కి మాత్రం మన పానీ పూరి టేస్ట్ చాలా నచ్చి మళ్లీ మళ్లీ అడిగి వేయించుకొని తిన్నారట. అయితే ఇప్పుడు ఈ పానీపూరి గురించి ఇప్పుడు టాఫిక్ ఎందుకు వచ్చిందంటే ...ఈ టేస్టీ స్నాక్‌ను రుచి చూసేందుకు కొరియన్(Korean ) యూట్యూబర్ (YouTuber) వీధుల్లోకి రావడం ఆకట్టుకుంది. ఈ కొరియన్( Korean)యూట్యూబర్(YouTuber) లడ్కా భారత్‌లో ఐదేండ్ల నుంచి నివసిస్తున్నారు.
అయితే ఈ కొరియన్ యూట్యూబర్ భారత్‌లో తన అనుభవాలను(experiences) లడ్కా షార్ట్ వీడియోల ద్వారా ప్రపంచాని(country )కి చేరవేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రాం (Instagram)లో ఇటీవల అతడు పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో స్ట్రీట్ ఫుడ్ వెండర్ నుంచి లడ్కా పానీ పూరీని టేస్ట్ చేయడం కనిపిస్తుంది. ముందుగా పానీ పూరీని ఆరగించిన అతడు ఆపై టేస్ట్(taste)బావుందంటూ మరికొన్ని తినడం చూడొచ్చు. తాను స్ట్రీట్ పానీ పూరీ ( pani puri)ని ట్రై చేశానని, మీకు ఇష్టమైన దేశీ స్ట్రీట్ ఫుడ్ గురించి కామెంట్స్ (comments)సెక్షన్‌లో తనకు తెలియచేస్తే మరోసారి తాను వాటిని ప్రయత్నిస్తానని పోస్ట్‌లో లడ్కా రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.