మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkata Reddy) కన్ఫ్యూజన్‌లో ఉన్నారో, లేకపోతే అందరిని కలుపుపోదామని అనుకుంటున్నారో తెలియదు కానీ ఆయన వ్యవహారం మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్స్‌(ట్విట్టర్)లో ఆయన చేస్తున్న పోస్టులే ఇందుకు కారణం. డిసెంబర్‌ 30వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో కలిసి ఉన్న ఫోటోను కోమటిరెడ్డి పోస్ట్‌ చేశారు. దానికి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ కాప్షన్‌ పెట్టారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkata Reddy) కన్ఫ్యూజన్‌లో ఉన్నారో, లేకపోతే అందరిని కలుపుపోదామని అనుకుంటున్నారో తెలియదు కానీ ఆయన వ్యవహారం మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్స్‌(ట్విట్టర్)లో ఆయన చేస్తున్న పోస్టులే ఇందుకు కారణం. డిసెంబర్‌ 30వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో కలిసి ఉన్న ఫోటోను కోమటిరెడ్డి పోస్ట్‌ చేశారు. దానికి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ కాప్షన్‌ పెట్టారు. ఈయన పోస్ట్‌కు అర్థమేమిటో తెలియకు నెటిజన్లు కాసింత అయోమయం చెందారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(RevanthReddy) బొమ్మ లేకుండా, రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండా భట్టి విక్రమార్కతో కలిసి కొత్త శకాన్ని ఎలా నిర్మిస్తారు? దీని వెనుక ఏదో ఉద్దేశం లేకపోలేదు అని కొందరు సందేహపడ్డారు. ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్‌ వేశారా? రేవంత్‌రెడ్డికి చెక్‌ పెట్టాలనుకుంటున్నారా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి కొందరికి. అయితే ఈ సందేహాలన్నింటినీ పటాపంచాలు చేస్తూ మరో వీడియోను పోస్ట్‌ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటీవల విడుదలై హిట్‌ కొట్టిన ప్రభాస్‌ (Prabhas)సినిమా సలార్‌(Salaar)లోని సూరీడే పాటను పోస్ట్ చేశారు. తన ఫొటోలు, రేవంత్ రెడ్డి ఫొటోలతో కంచె ఒకడైతే.. అది మించెవాడొకడే అంటూ వీడియోను రూపొందించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరం మంచి మిత్రులమని అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యాన్స్‌ సంతోషపడ్డారు. మీరంతా ఇలానే కలిసి ఉండాలని కామెంట్‌ చేస్తున్నారు. నేతలు ఐక్యమత్యంగా ఉంటే అది పార్టీకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated On 1 Jan 2024 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story