Holi Festival : హోలీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.!
హోలీ అంటే సంబరాల పండుగ . పిల్లలు పెద్దలు రక రకాల రంగులతో సంతోషం గా జరుపుకునే వేడుక హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి.. మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు . పండుగలు ఏవైనా ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటి ఉంటుంది. […]
హోలీ అంటే సంబరాల పండుగ . పిల్లలు పెద్దలు రక రకాల రంగులతో సంతోషం గా జరుపుకునే వేడుక హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి.. మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు . పండుగలు ఏవైనా ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటి ఉంటుంది. గుప్పెడు రంగును చేతపట్టుకుని గుండెల్లో ఉండే భావాలను వ్యక్తపరిచే పండుగ. ఇరుగు పొరుగువారితో, స్నేహితులు, సన్నిహితులు, ప్రియమైనవారితో సంతోషాలు పంచుకునే ఆనంద కేళీ హోలీ. హోలీని డోలోత్సవం అనికూడా అంటారు. హోలీ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనం గోపికలతో చేరి రంగులు, పూలతో పండుగను జరుపుకున్నట్టుగా పురాణాల్లో ఉంది. ఈ రోజు పువ్వులు, రంగులను ఒకరిపై ఒకరు జల్లుకోవడం వల్ల సౌభాగ్యాలు, అనుబంధాలు, ప్రేమలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.
అయితే ఈ హోలీ పండుగ సంబురాల్లో కెమికల్స్ తో కూడిన రంగులు వాడటం వల్ల ఒక్కోసారి అపశ్రుతులు చోటుచేసుకుంటాయి . రంగులో ఉన్న రసాయనాలు ఉపయోగించి జీవితాల్ని చీకటిమయం చేసుకోకుడదు..అందుకే సహజ రంగులు ఎంచుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది. మరోవైపు నిపుణులు రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ హోలీ సంబరాల్లో రంగుల వాడటం లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు .
హోలీ ఆడే ముందు ఫేస్ కీ బాడీకీ ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లో ఏదో ఒకటి ఉపయోగించండి. ఈ ఆయిల్స్ మీ స్కిన్ కీ, కలర్స్ కీ మధ్య ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా ఉంటాయి. అలాగే, హోలీ తరువాత ఆ రంగుల్ని వదిలించుకోవడం కూడా తేలిక అవుతుంది.
హోలీ రోజు ఎవరైనా రంగులు రుద్ధినప్పుడు దాన్ని సబ్బుతో కాకుండా ఫేస్‌వాష్‌తో కడగాలి. లేదా పెరుగు, పసుపు, తేనె, శనగపిండి మిశ్రమంతో బాడీనీ ఫేస్ నీ క్లీన్ చేసుకోండి. కానీ కడిగేటప్పుడు చర్మంపై అంటుకున్న రంగుని రుద్ది రుద్ది కడగకూడదు. ముఖంపై దురద పెడితే గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి ముఖంపై రాసుకోవాలి . ఆ తరువాత కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.
తడి రసాయన రంగుల్లో కూడా కాపర్ సల్ఫేట్, మెర్క్యూరీ సల్ఫేట్, క్రోమియం లాంటి కర్బన, బెంజీన్ లాంటి ప్రమాదకర ఎరోమెటిక్ సమ్మేళనాలుంటాయి. సిల్వర్ రంగులో ఉండే బ్రొమైడ్, ఎర్ర రంగులో ఉండే మెర్య్యూరీ సల్ఫైడ్ చర్మ కేన్సర్‌కు దారి తీయొచ్చు. దీంతో పొడిబారటం, దద్దుర్లు, మంట, మచ్చలు, ఎలర్జిక్ డెర్మటైటిస్‌తోపాటు కొన్ని కేసుల్లో చర్మం మాడిపోతుంది. ఇలాంటప్పుడు రసాయనాల్లో ఉన్న సూక్ష్మతత్వాలు, చర్మంలో చేరి స్కిన్ కేన్సర్‌కు కారణమవుతాయి.
జుట్టు మీద నుంచి హోలీ రంగులు తొలగించడానికి మైల్డ్ నాచురల్ షాంపూ కానీ, బేబీ షాంపూ కానీ యూజ్ చేయవచ్చు, వీటిలో కెమికల్స్ ఉండవు.హోలీ రోజు చర్మాన్ని రంగుల నుంచి కాపాడేందుకు మొత్తం శరీరాన్ని కప్పే బట్టలు వేసుకోవడం మంచిది . అందుకే కెమికల్స్ లేని రంగులతో.. మన పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం.