వసంత పంచమి(Vasantha Panchami) నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు(Knowledge) సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక(Slate) మీద బలపంతో ఓం నమ.. శివాయ సిద్ధం నమ.హ. అని రాసి దిద్దిస్తారు.

వసంత పంచమి(Vasantha Panchami) నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు(Knowledge) సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక(Slate) మీద బలపంతో ఓం నమ.. శివాయ సిద్ధం నమ.హ. అని రాసి దిద్దిస్తారు.

అక్షరాభ్యాసం ఎలా చేయాలి?

విద్య(Education) బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల(Elders) అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో(Child) తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ.

పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ(Vijaya Dashami), శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం.

సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో(5th year) ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి(Student) లభిస్తుంది. ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లోగానీ, దేవాలయంలోగానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు.

మన సంప్రదాయంలో(Hindu Traditions) విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థిచేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలనూ తొలగించే వినాయకుణ్ణి(Lord Ganesh), విద్యల దేవత అయిన సరస్వతీ(Goddesses Saraswathi) దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి(Lord Dakshinamurthy), దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యాదేవతలుగా పూజిస్తారు.

ఆ తరువాత ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు(Lord Shiva) కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది.

విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై(Rice) రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం.

Updated On 14 Feb 2024 12:21 AM GMT
Ehatv

Ehatv

Next Story