లక్ అంటే ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు . కొందరికి కష్టపడితే వస్తుంది . కొందరికి ఏమాత్రం కష్టం లేకుండానే అదృష్టం వస్తుంది. రాత్రికి రాత్రే జాక్ పాట్ (jackpot) కొట్టేస్తుంటారు ఇంకొందరు. మొత్తానికి లక్ వల్ల వచ్చే కిక్ వేరబ్బా !ఏమంటారు .. కేరళ లో ఒక సినీ నటి ఇంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఆల్బర్ట్ (albert ) ఇలానే అనుకోకుండా వచ్చిన అదృష్టం తో రాత్రికి రాత్రే 10 కోట్లు (10 […]

లక్ అంటే ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు . కొందరికి కష్టపడితే వస్తుంది . కొందరికి ఏమాత్రం కష్టం లేకుండానే అదృష్టం వస్తుంది. రాత్రికి రాత్రే జాక్ పాట్ (jackpot) కొట్టేస్తుంటారు ఇంకొందరు. మొత్తానికి లక్ వల్ల వచ్చే కిక్ వేరబ్బా !ఏమంటారు .. కేరళ లో ఒక సినీ నటి ఇంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఆల్బర్ట్ (albert ) ఇలానే అనుకోకుండా వచ్చిన అదృష్టం తో రాత్రికి రాత్రే 10 కోట్లు (10 crores )లాటరి తో కోటీశ్వరుడు అయ్యాడు .

1995 లో పని కోసం కేరళ వెళ్ళాడు ఆల్బర్ట్ . గత కొన్ని ఏళ్లుగా రజిని చాందీ అనే సినీ నటి ఇంట్లో అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు . అయితే ఆల్బర్ట్ కు లాటరి (lottery )టికెట్స్ కొనే అలవాటు చాల కాలం గా ఉంది . ఎప్పటిలాగానే ఈ సరి కూడా ఎస్ఈ 222282 టికెట్ కొన్నాడు . ఇంకేముంది లక్ష్మి దేవి ఆల్బర్ట్ ఇంటి తలుపు తట్టింది .తిరువనంతపురం గోర్కీభవన్ లో జరిగిన లక్కీ డ్రా (lucky draw ) కేరళ లాటరి డిపార్ట్మెంట్ సమ్మర్ బీ ఆర్ 90 లాటరి విడుదల చేసిన ఫలితాల్లో ఆల్బర్ట్ కి ఏకంగా ఊహించని విధంగా 10 కోట్ల బంపర్ లాటరి (bumper lottery )తగిలింది . ఇక ఆల్బర్ట్ ఆనందానికి అవధుల్లేవు .

ఈ లాటరి లో మొదటి బహుమతి(First Prize )10 కోట్లు కాగా రెండవ బహుమతి (Second Prize )SB 152330 లభించింది. ఎర్నాకులం లో అమ్మిన ఈ టిక్కెట్లకు మొదటి,రెండవ బహుమతులు వచ్చాయి. బంపర్ లాటరి ని పొందిన ఆల్బర్ట్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని కొచ్చి(cochin ) లో ని ఒక బ్యాంకు లో లాటరి టికెట్ ని ఇవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది . ఇది ఇలా ఉండగా గతం లో కూడా లాటరి అవకాశాన్ని పొందిన వాళ్లలో కేరళ వాసులు కావటం విశేషం. అలాగే ఆ సమయం లో నిరుపేద కుటుంబంలోని వ్యక్తి కి అనుకోకుండా లాటరి తగలటం తో వార్తలు బాగా అందరికి చేరుకోవటం తో అటు మీడియా తో పాటు మరికొన్ని పెట్టుబడి సంస్థలు ,చందాదారులు ,బ్యాంకులు మావద్ద డిపాజిట్ చేయండి అంటూ మాకు విరాళంగా మనీ ఇవ్వమని కొందరు ఇబ్బంది పెట్టినట్లు తమ ఇబ్బందిని వివరించటం జరిగింది. చాల మంది లాటరి టిక్కెట్లను(lottery ticket ) చాల చిన్న చూపు చూస్తుంటారు .కానీ కొంత మంది వీటిని బాగా నమ్ముతారు. ఇలా లాటరి టికెట్ కొనే అలవాటు ఉన్న ఆల్బర్ట్ ని రాత్రికి రాత్రి కోటీశ్వరున్ని చేసింది .

Updated On 21 March 2023 2:19 AM GMT
rj sanju

rj sanju

Next Story