Kathi Karthika : బీఆర్ఎస్లో చేరిన కత్తి కార్తీక
కాంగ్రెస్(congress) పార్టీకి కత్తి కార్తీక(Kathi Karthika) రాజీనామా చేశారు. శుక్రవారం ఆమె మంత్రి హరీశ్‌రావు(Harish Rao) సమక్షంలో బీఆర్‌ఎస్‌లో(BRS) చేరారు. మంత్రి హరీశ్‌రావు ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్తీక 2021లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆపై రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలోనూ ఆమె చురుగ్గా పాల్గొన్నారు
కాంగ్రెస్(congress) పార్టీకి కత్తి కార్తీక(Kathi Karthika) రాజీనామా చేశారు. శుక్రవారం ఆమె మంత్రి హరీశ్‌రావు(Harish Rao) సమక్షంలో బీఆర్‌ఎస్‌లో(BRS) చేరారు. మంత్రి హరీశ్‌రావు ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్తీక 2021లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆపై రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలోనూ ఆమె చురుగ్గా పాల్గొన్నారు. కత్తి కార్తీక దుబ్బాక(Dubbaka) టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్‌లో చేరారు. కత్తి కార్తీక రేడియో జాకీగా(Radio Jockey) పనిచేశారు. ఆపై యాంకర్‌గా రాణించారు. అనంతరం బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.