Karishma Kapoor: ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారితో పడుకోవాలనేవాడు.. మాజీ భర్తపై కరిష్మాకపూర్ సంచలన వ్యాఖ్యలు
తన మాజీ భర్తపై ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ (Karishma Kapoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ భర్త తనను చిత్ర హింసలకు గురిచేశాడని ఆమె చెప్పుకొచ్చారు. తన భర్త (Sanjay Kapoor) తనను పశువులా వేలం వేశాడని ఆమె ఆరోపించారు.

karhima-compressed
తన మాజీ భర్తపై ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ (Karishma Kapoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ భర్త తనను చిత్ర హింసలకు గురిచేశాడని ఆమె చెప్పుకొచ్చారు. తన భర్త (Sanjay Kapoor) తనను పశువులా వేలం వేశాడని ఆమె ఆరోపించారు. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారితో పడుకోవాలని కోరేవాడని చెప్పుకొచ్చారు. కానీ ఇలాంటి నీచమైన పనులు నేను చేయలేనని తెగేసి చెప్పానని కరిష్మా వివరించారు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన మాజీ భార్యతో ఎఫైర్ కొనసాగించేవాడని కరిష్మా వివరించారు. తన వేధింపులు భరించలేకనే భర్తతో విడాకులు తీసుకున్నానని వెల్లడించారు.
కరిష్మా కపూర్ 1991లో ప్రేమ్ ఖైదీ చిత్రంతో బాలీవుడ్‌లో (Bollywood) ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జిగర్ (1992), అనారీ (1993), రాజా బాబు (1994), కూలీ నంబర్ 1 (1995)తో సహా అనేక బాక్సాఫీస్ హిట్ సినిమాల్లో నటించింది. సాజన్ చలే ససురల్ (1996), మరియు జీత్ (1996). అత్యధిక వసూళ్లు చేసిన రొమాన్స్ రాజా హిందుస్తానీ (1996), దిల్ తో పాగల్ హై (1997)లో నటించిన పాత్రలు కరిష్మాను స్టార్‌గా నిలబెట్టాయి. ఆమె నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును, జాతీయ చలనచిత్ర పురస్కారం, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.
