బాలీవుడ్‌(Bollywood) హీరోయిన్‌ కంగనా రనౌత్‌ గురించి చెప్పడానికి ఏముంటుంది? తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని, రోజూ వార్తల్లో ఉండే కంగనా రనౌత్‌ అద్భుతమైన నటి! నటిగా ఆమెకు వంక పెట్టాల్సిందేమీ ఉండదు. అలాంటి గొప్ప నటికి 2023 సంవత్సరం అంతగా అచ్చి రాలేదు. గత ఏడాదిలో కంగనా రనౌత్‌(Kangana ranaut) నటించిన ఏ ఒక్క సినిమా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. హిందీలో నటించిన తేజస్‌(Tejas), తమిళంలో నటించిన చంద్రముఖి-2(Chandramukhi-2) అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాయి.

బాలీవుడ్‌(Bollywood) హీరోయిన్‌ కంగనా రనౌత్‌ గురించి చెప్పడానికి ఏముంటుంది? తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని, రోజూ వార్తల్లో ఉండే కంగనా రనౌత్‌ అద్భుతమైన నటి! నటిగా ఆమెకు వంక పెట్టాల్సిందేమీ ఉండదు. అలాంటి గొప్ప నటికి 2023 సంవత్సరం అంతగా అచ్చి రాలేదు. గత ఏడాదిలో కంగనా రనౌత్‌(Kangana ranaut) నటించిన ఏ ఒక్క సినిమా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. హిందీలో నటించిన తేజస్‌(Tejas), తమిళంలో నటించిన చంద్రముఖి-2(Chandramukhi-2) అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాయి. అంతకు ముందు వచ్చిన సినిమాలు కూడా అంతే! భారీ అంచనాలతో విడుదలైన తలైవి సినిమా అపజయానని చవిచూసింది. ఇప్పుడామె ఆశలన్నీ ఎమర్జెన్సీ సినిమాపైనే పెట్టుకుంది. నిజానికి ఈ సినిమా కూడా 2023 సంవత్సరాంతంలో విడుదల కావాలి. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఎమర్జెన్సీ(Emergency) సినిమాలో కంగనా రనౌత్‌ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ(Indira Gandhi) పాత్రలో నటిస్తున్నారు. లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో(Social media) కంగనా ఓ మాట చెప్పారు. ఇంట్లో లేనప్పుడే తాను ప్రశాంతంగా, సంతోషంగా ఉంటానని అందులో ఎక్స్‌ మీడియా (Twitter)లో తెలిపారు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండటానికి అసలు ప్రయత్నించవద్దని, ఈ విషయానని తాను 2023లో తెలుసుకోగలిగానని కంగనా తెలిపారు. తాను ఎంతో కష్టపడి తన డ్రీమ్‌ హౌస్‌ను, గెస్ట్‌ హౌస్‌ను, ఫామ్‌ హౌస్‌ను నిర్మించుకున్నానని చెబుతూ అయినప్పటికీ ఇంటిలో ఉన్నప్పుడు కలగని ప్రశాంతత, ఆనందం బయట ఉన్నప్పుడు కలుగుతుందన్న విషయాన్ని గ్రహించానని అన్నారు. మనం ఈ శరీరానికి సొంతదారులం కాదని, ఈ జీవితం చాలా చిన్నదని, ఇది తనకు ఇప్పడిప్పుడే తెలిసివస్తున్నదంటూ వేదాంతం చెప్పారు.

Updated On 1 Jan 2024 1:47 AM GMT
Ehatv

Ehatv

Next Story