పదకొండేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఒక వ్యక్తికి 60 ఏళ్ల జైలు శిక్ష విధించిన నల్గొండ జిల్లా (Nalgonda Dist) అదనపు సెషన్స్ న్యాయమూర్తి తిరుపతి (Justice Tirupathi). నల్గొండ శివారులో ఉంటున్న బాలికకు నిజాముద్దీన్(36) (Nizamuddin) మాయ మాటలుచెప్పి, అత్యా చారానికి పాల్పడ్డాడు.
పదకొండేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఒక వ్యక్తికి 60 ఏళ్ల జైలు శిక్ష విధించిన నల్గొండ జిల్లా (Nalgonda Dist) అదనపు సెషన్స్ న్యాయమూర్తి తిరుపతి (Justice Tirupathi). నల్గొండ శివారులో ఉంటున్న బాలికకు నిజాముద్దీన్(36) (Nizamuddin) మాయ మాటలుచెప్పి, అత్యా చారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి (Pregnancy) అయింది. బాధిత బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. నిజాముద్దీన్ పై పోక్సోతో (Pocso) పాటు పలు కేసులు పెట్టారు. ఈ కేసులో శుక్రవారం న్యాయమూర్తి తీర్పు చెప్తూ పోక్సోతోపాటు మరో రెండు సెక్షన్ల కింద మూడు వేర్వేరు నేరాలకు సంబంధించి ఒక్కొక్క నేరానికి 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ఈ మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు ఇచ్చారు. బాలికకు 10 లక్షల నష్ట పరిహారం చెల్లించడమే కాకుండా.. నిందితుడికి 60 వేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు.