కామారెడ్డి(Kama Reddy) జిల్లా రాజంపేటలో ఆముద సత్యనారాయణ(Satyanarayana), ఊర్మిల(Urmila) దంపతులు గత 50 ఏళ్ల నుంచి మిర్చీ బజ్జీలు అమ్ముతున్నారు. గ్రామాల్లో జరిగే వారంతపు సంతల్లో, జాతరల్లో(Jatara), ఉత్సవాల్లో ఈ వ్యాపారం చేసేవారు. రాజంపేటలోని ప్రధాన చౌరస్తాలో ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు. ఇంటి దగ్గరే పొయ్యి మీద మిర్చీలు వేసి బండిపై పెట్టుకుని అమ్ముతున్నారు. తొలుత రూపాయికి 16 బజ్జీలు ఇచ్చేవారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో క్రమక్రమంగా రూపాయికి 10 బజ్జీలను తగ్గించారు. కొన్ని రోజులపాటు రూపాయికి 4 మిర్చీలు ఇచ్చేవారు.

కానీ ఇప్పుడు కూడా అతి తక్కువు ధరలో రూపాయికి ఒక మిర్చీ బజ్జీని(Mirchi Bajji) సత్యానారాయణ దంపతులు అమ్ముతున్నారు. రాజంపేట చూట్టు ప‌క్క‌ల గ్రామాల ప్రజలు ప్ర‌త్యేకంగా అక్కడకు వచ్చి మిర్చీ బ‌జ్జిలు తీసుకుని వెళ్తారు. ధర త‌క్కువ , మంచి రూచిగా ఉండడంతో ఈ బజ్జీలకు ఆదరణ పెరిగింది. ఒక్కొక్కరు 20 నుంచి 100 రూపాయ‌ల బజ్జీలు కొనుగోలు చేస్తారు. ఉ. 9 నుంచి రా.9 వరకు బజ్జీల విక్రయాలు చేస్తుంటారు. వీరి కౌంటర్‌ రోజుకు 5 వేలకుపైమాటే. ఇతని కొడుకు కూడా తండ్రికి తోడుగా మిర్చిబజ్జీ వ్యాపారంలో చూసకుంటున్నాడు. రాజంపేట(Rajampeta) మండల కేంద్రంలో సత్యనారాయణ బండి దగ్గర మిర్చీ బజ్జీల కోసం జనం ఎగబడతారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తాను మిర్చీబజ్జీ అమ్మడం ప్రారంభించినప్పుడు రూపాయికి 16 మిర్చీలు ఇచ్చేవాడినని.. ధరల పెరుగుదలతో గత ఎనిమిదేళ్లుగా రూపాయికి ఒక్కటి చొప్పున విక్రయిస్తున్నానని తెలిపారు. మంచి నాణ్యతతో వీటిని తయారు చేస్తామని..ఒక్కొక్కరు సులభంగా 10 బజ్జీలు లాగేస్తారని సత్యనారాయణ వివరించారు.

Updated On 10 Feb 2024 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story