ఫిల్మ్ సెలబ్రిటీలు వాడే వస్తువులు.. వేసుకునే బట్టలపైనే నెటిజన్ల కన్ను ఉంటుంది. తమఅభిమాన నటులు ఎవైనా వెరైటీగా డ్రెస్సింగ్ చేసుకున్నా.. కాస్ట్లీ వస్తువలు వాడినా వాటిని వైరల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఫ్యాన్స్. ఇక మన టాలీవుడ్ జనాలు అయితే ఈ విషయంలో ఒక అడుగుముందే ఉంటారు.

ఫిల్మ్ సెలబ్రిటీలు వాడే వస్తువులు.. వేసుకునే బట్టలపైనే నెటిజన్ల కన్ను ఉంటుంది. తమఅభిమాన నటులు ఎవైనా వెరైటీగా డ్రెస్సింగ్ చేసుకున్నా.. కాస్ట్లీ వస్తువలు వాడినా వాటిని వైరల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఫ్యాన్స్. ఇక మన టాలీవుడ్ జనాలు అయితే ఈ విషయంలో ఒక అడుగుముందే ఉంటారు. టాలీవుడ్ లో కూడా ఎక్కువగా కాస్ట్లీ వస్తువులు వాడేవారిలో తారక్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పటికే తారక్ వాడిని చాలా వస్తువలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. కోట్ల విలువ చేసే ఆ వస్తువులను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ఈక్రమంలో తారక్ మరో వస్తువు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిత.

శుక్రవారం విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చాడు ఎన్టీఆర్. అందరూ తారక్ ను చూస్తూ అలా ఉండిపోయాడు.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ప్రతీ ఓక్కరిని ఆకర్షించింది. అయితే అందులో కొంత మంది ఫ్యాన్స్ అసలు పని స్టార్ట్ చేశారు. తారక్ ధరించిన హుడీ పై కన్నేశారు. అది ఏ బ్రాండ్.. ఎంత రేటు ఉంటుంది అంటూ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక దాని గురించి ఇన్ ఫర్మేషన్ బయటకు తీసి.. ఆ షర్ట్ ను సోషల్ మీడియలో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. అది చూసిన ఫ్యాన్స్ ఆ హుడీ గురించి ఇంకా తెలుసుకోవడం కోసం సెర్చ్ మొదలు పెట్టారు.

విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ బ్లాక్ హుడీ వేసుకుని వచ్చాడు అది బాగుంది కదా అని దాని రేటు గురించి సెర్చ్ చేయగా.. అది ఇది ఓనిట్సుకా టైగర్ అనే వెబ్ సైట్ లో 170 యూరోస్ కి అందుబాటులో ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 15 వేల వరకూ ఉంది. అయితే విచిత్రం ఏంటీ అంటే.. ఎన్టీఆర్ ఏది కొన్నా కాస్ట్లీగా కొంటారు. ఇప్పటి వరకూ ఆయన కోటి ,రెండు కోట్లు, నాలుగు కోట్ల వాచీలు ధరించి హైలెట్ అయ్యారు. ఫస్ట్ టైమ్ కాస్త తక్కువ రేటు ఉన్న షర్ట్ ను వేసుకున్నాడని అంటున్నారు ఫ్యాన్స్.

ఇక తారక్ వేసుకున్న ఆ హుడీపై బ్లాక్ అండ్ వైట్‌ షేడింగ్ లో మంటల డిజైన్ ఉంది. ఆ హుడీ ఎంతో యునీక్ గా కనిపించింది. బ్లాక్ కలర్ హుడీపై వైట్ కలర్ లో మంటలు వస్తున్నట్లుగా గ్రాఫిక్ ప్రింట్ ఉంది. ఇది బ్లాక్- ఆరెంజ్ కాంబో కలర్ వేరియంట్ లో ఉంది.
ఇక బ్లాక్ హుడీలో ఎన్టీఆర్ లుక్ వైరల్ అవుతోంది. అంతే కాదు తారక్ సింపుల్ గా వచ్చారంటూ ఫ్యాన్స్ మరో ప్రచారం కూడా మొదలు పెట్టారు.

Updated On 20 March 2023 12:24 AM GMT
Ehatv

Ehatv

Next Story