✕
జాన్వీకపూర్(Janhvi kapoor).. ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి(Sridevi) కూతురు అని మనకు తెలిసిన విషయమే. హిందీ సినిమా 'ధడక్'తో(Dhadak) బాలీవుడ్లో(Bollywood) ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. తెలుగులో ఎన్టీఆర్(NTR) దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో(Telugu) మరో సినిమా ఎన్టీఆర్ 30లో నటిస్తున్న సంగతి కూడా తెల్సిందే. ఈ మూవీ ద్వారా తొలిసారి దక్షిణాది(South india) గడ్డమీద అడుగుపెట్టబోతుంది జాన్వీ.

x
janhvi kapoor
-
- తెలుగులో(Telugu) మరో సినిమా ఎన్టీఆర్ 30లో నటిస్తున్న సంగతి కూడా తెల్సిందే. ఈ మూవీ ద్వారా తొలిసారి దక్షిణాది(South india) గడ్డమీద అడుగుపెట్టబోతుంది జాన్వీ.
-
- సౌత్ ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందం కలిగిస్తుందని ఇటీవలే జాన్వీ తెలిపింది. ఎన్నాళ్లో వేచి చూసిన సమయం రానే వచ్చిందని చెప్పుకొచ్చింది. కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
-
- ఎన్టీఆర్ 30 సినిమాలో మత్స్యకారుడి(Fishermen) కూతురుగా జాన్వీ నటిస్తోందని.. ఎక్కువ సన్నివేశాల్లో లంగా ఓణిలో(Half saree) జాన్వీ కనిపిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో జాన్వీ పాత్ర పేరు తంగం(Tangam) అని సమాచారం.
-
- ఇది ఇలా ఉండగా తాజాగా జాన్వీ ఇచ్చిన ఇంటర్వ్యూలో(Interview) పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. తన చిన్నతనంలో తన అనుమతి లేకుండా కొందరు తనవి, తన చెల్లి ఫొటోలు మార్ఫింగ్(Marfing) చేసి పలు న్యూడ్ సైట్లలో(Nude web sites) పోస్ట్ చేశారని.. ఆ సయమంలో తనకు చాలా బాధ వేసిందని చెప్పారు. అప్పుడు తనకు 10 ఏళ్లని.. అంత చిన్న వయస్సులో తన ఫొటోలను(Photos) మార్ఫింగ్ చేశారని చెప్పింది.
-
- ఆ వయసులో తనకు లోక జ్ఞానం కూడా పెద్దగా లేదని.. ఇలా మార్ఫింగ్ చేసిన ఫొటోలను చూసి ప్రజలు(Public) ఇవే నిజమైనవని నమ్ముతారని.. ఆ సమయంలో తన స్నేహితులు (Friends) కూడా తనను ఎగతాళి చేశారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
-
- దేవరతో పాటు జాన్వీకి మరో తెలుగు సినిమాలో కూడా చాన్స్ వచ్చినట్లు సమాచారం. వంశీ యూవీ క్రియెషన్స్(Vamshi UV creations) బ్యానర్లో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ కుమార్(Anil kumar) అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీని హీరోయిన్గా (Heroine) నియమించుకుంటున్నారని సమాచారం.
-
- దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchibabu sana) దర్శకత్వం, మెగా పవర్‌స్టార్ రాంచరణ్(Ramcharan) హీరోగా వస్తున్న మరో సినిమాలో జాన్వీని హీరోయిన్గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి జాన్వీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది
-
- కబడ్డీ(Kabbadi) బ్యాక్‌డ్రాప్‌లో రాంచరణ్ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో(Pre-production) ఉంది. దీనికి ఏఆర్ రెహమాన్(AR Rehaman) సంగీతం అందించబోతున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్‌ది డబుల్ రోల్ అని.. ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను, మరో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్‌ని(Mrunal Thakur తీసుకుంటారని టాక్.
-
- ఇక జాన్వీ రెమ్యూనరేషన్(Remunaration) కూడా గట్టిగానే ఉందట. సాధారణంగా ఒక్కో హిందీ సినిమాకు 3.5 కోట్ల వరకు తీసుకుంటున్న ఆమె... తెలుగు సినిమాలకు మాత్రం 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని తెలిసింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా జాన్వీ ఖరారు కావడంతో.. ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలకే డేట్స్(Dates) కేటాయిస్తుందని తెలిసింది.
-
- ఆ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూ(interview) ఇస్తూ.. తాను ఇంతలా అందాలు ఆరబోయడానికి కారణాలు చెప్తూ.. కాస్తా బోల్డ్‌గా(Bold) ఉంటేనే తనకు మరిన్ని బ్రాండ్లు వస్తాయని.. తద్వారా తనకున్న ఈఎంఐల (EMI) భారం కాస్త తగ్గుతుందని... అందుకే కొంత బోల్డ్ నెస్ ఎక్కువైనా అలానే కనిపిస్తానని.. సోషల్ మీడియాను సీరియస్‌గా తీసుకోనని చెప్పుకొచ్చింది.

Ehatv
Next Story