పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ అమ్మాయి రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రీల్ వార్తల్లోకి రావడానికి కారణం వీడియోలో ఉపయోగించిన పంజాబ్ పోలీసు వాహనం.

పంజాబ్‌లోని జలంధర్‌(Jalandhar)కు చెందిన ఓ అమ్మాయి రీల్(Reel) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రీల్ వార్తల్లోకి రావడానికి కారణం వీడియోలో ఉపయోగించిన పంజాబ్ పోలీసు వాహనం(Police Van). వీడియో వైరల్ కావడంతో అధికారులు.. జలంధర్ పోలీస్ స్టేషన్-4 SHO అశోక్ శర్మ(Ashok Sharma)పై చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఈ వైరల్ వీడియోలో.. రద్దీగా ఉండే మార్కెట్‌లో SHO ప్రభుత్వ వాహనంపై ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వీడియోలో అమ్మాయి తనను తాను.. 'నేను సింహం, నేను సింహం' అని అర‌వ‌డం చూడొచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ వీడియోను సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేసినా ఆ యువతిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.

స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్ అశోక్‌ శర్మ రాత్రి వేళ పెట్రోలింగ్‌ వాహనం తీసుకుని బయటకు వెళ్లారు. రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. ఆసమయంలో ఓ వయుతి పోలీసు కారు వద్దకు వచ్చింది. తాను రీల్‌ చేస్తానని అందుకు కారుని వినియోగించుకుంటానని రిక్వెస్ట్‌ చేసింది. దాంతో.. కాసేపు ఖాళీగా ఉన్న పోలీసు అధికారి అశోక్‌ శర్మ ఆ యువతిని రీల్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. దాంతో ఆ యువతి కారు బ్యానెట్‌ పైకి ఎక్కి రీల్‌ చేసింది. డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా చేతులు ఊపుతూ స్టెప్పులు వేసింది. అంతేకాదు.. పోలీస్ వాహనంపైనే కూర్చొని అభ్యంతరకరంగా వేళ్లతో సైగలు చేసింది. కాగా.. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యి పోలీసు ఉన్నతాధికారుల వరకూ చేరింది. ఆ యువతి అలా అభ్యంతరకరంగా చేతివేళ్లను చూపడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సంఘటనపై ఆరా తీయగా.. యువతికి రీల్‌ చేసుకునేందుకు స్టేషన్ ఆఫీసర్ అశోక్‌ శర్మ అనుమతి ఇచ్చినట్లు తేలింది. దాంతో.. అశోక్‌ శర్మపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. సస్పెండ్(Suspend) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated On 28 Sep 2023 11:21 PM GMT
Yagnik

Yagnik

Next Story