Snakes Take Revenge : రాజస్థాన్లో దారుణం.. పగతీర్చుకున్న పాము.!
జోధ్పూర్లోని మెహ్రాన్గఢ్ గ్రామానికి చెందిన 44 ఏళ్ల జసబ్ ఖాన్ పాము జూన్ 20 న పాము కాటుకు గురయ్యాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు జసబ్ ని పోఖ్రాన్లోని ఆసుపత్రి కి తరలించి వైద్యం అందించారు. నాలుగు రోజుల వైద్యం అనంతరం జూన్ 25 న ఇంటికి తిరిగి వచ్చాడు.
నాగలోకాలు, పాములు పగ పట్టడం, ప్రపంచంలో ఎక్కడవున్నా పగపట్టిన పాము ఆ వ్యక్తిని కాటేసి చంపడం మనం కథలు, సినిమాలలోనే చూస్తూ ఉంటాం. రాజస్థాన్ లో అచ్చం సినిమాలో, కథలో చూసినట్టే ఒక పాము పగ పట్టి ఒక వ్యక్తిని చంపింది.
జోధ్పూర్లోని మెహ్రాన్గఢ్ గ్రామానికి చెందిన 44 ఏళ్ల జసబ్ ఖాన్ పాము జూన్ 20 న పాము కాటుకు గురయ్యాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు జసబ్ ని పోఖ్రాన్లోని ఆసుపత్రి కి తరలించి వైద్యం అందించారు. నాలుగు రోజుల వైద్యం అనంతరం జూన్ 25 న ఇంటికి తిరిగి వచ్చాడు.
పాముకాటు నుంచి బైట పడ్డ జసబ్ ని ఆ పాము మాత్రం వదల్లేదు. సరిగ్గా ఒక రోజు ఆగి జూన్ 26 న మరోసారి అదే పాము మళ్ళి జసబ్ ని కాటేసింది. ఈ సారి కూడా కుటుంబసభ్యులు ఆసుపత్రి కి తీసుకువెళ్లారు కానీ జసబ్ బ్రతకలేదు. మొదటి పాము కాటు విషంతోనే ఇంకా పూర్తిగా కోలుకొని జాసాబ్ ని మళ్ళి పాము కాటు వేయడంతో జసబ్ ని బ్రతికించలేకపోయాం అని వైదులు చెప్తున్నారు.
రాజస్థాన్ ఎడారి ప్రాంతాలలో సాధారణంగా కనిపించే వైపర్ జాతి పాము కాటుకి చాలామంది గురయ్యారని, ఇలా 5 రోజుల వ్యవధిలో ఒకే వ్యక్తిని పగ పట్టి రెండు సార్లు కాటేసి చంపడం ఇదే తోలి సారని స్థానికులు, కుటుంబసభ్యులు అంటున్నారు.