భారత్-ఇంగ్లండ్ మహిళల క్రికెట్(Women Cricket) జట్ల‌ మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్(Bharat) రెండుసార్లు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది. త‌ద్వారా ఇంగ్లండ్‌పై భారత్ 347 పరుగుల భారీ తేడాతో విజయం(Victory) సాధించింది. భారత బౌల‌ర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ కుప్పకూలారు. దీప్తి శర్మ(Deepthi sarma) రెండో ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టింది. పూజా వస్త్రాకర్(pooja vastrakar) కూడా 3 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోనివ్వలేదు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను భారత్ 131 పరుగులకే ఆలౌట్ చేసింది.

టాస్(Toss) గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 10 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. భారత్‌కు చెందిన నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు సాధించారు. సమాధానంగా ఇంగ్లండ్(England) జట్టు తొలి ఇన్నింగ్సులో కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో(Second innings) ఇంగ్లండ్ విజయానికి 479 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్ జట్టు 200 పరుగుల మార్కును కూడా అందుకోలేక కేవలం 131 పరుగులకే కుప్పకూలింది(All out). ఏకైక‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటి వరకూ మొత్తం 39 టెస్టు మ్యాచ్‌లు(Test match) ఆడగా.. అందులో 6 మ్యాచ్‌ల్లో మాత్ర‌మే విజయం సాధించింది. అదే సమయంలో భారత్ 6 మ్యాచ్‌లు ఓడిపోగా.. 27 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Updated On 16 Dec 2023 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story