బ్రెజిల్‌(Brazil) పక్కనే అట్లాంటిక్‌ మహాసముద్రంలో(Atlantic Sea) ఈ ద్వీపం(Island) ఉంది. బ్రెజిల్‌ తీర ప్రాంతం సావోపా నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దగ్గరే కదా అని పడవేసుకుని వెళితే మాత్రం వెనక్కి పడవే వస్తుంది కానీ వెళ్లిన వారు రారు. ఎందుకంటే ఆ దీవి నిండా పాములే(Snake)! అడుగడుగునా పాములుంటాయి. ఈ ద్వీపం పేరు సావోపౌల్‌.. ఇల్హా డా క్యూమాడా గ్రాండే.. సుమారు 110 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఇందులో కనీసం నాలుగున్నర లక్షల(4.5 Lakhs Snakes) పాములుంటాయి.

దూరం నుంచి చూస్తే ఆ ద్వీపం(Island) అందంగా కనిపిస్తుంది. ఆకుపచ్చటి తివాసి పర్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రమణీయ ద్వీపాన్ని దూరం నుంచి చూసి ఆనందించాలే కానీ అందులో అడుగు పెట్టకూడదు.. సాహసం చేయాలనే బుద్ధి పుట్టి అడుగపెట్టారే అనుకుందాం! చావును కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మృత్యువును కౌగిలించుకున్నట్టే అవుతుంది. ఎందుకు ? ఆ ద్వీపంలో దయ్యాలేమైనా ఉన్నాయా? దయ్యాలు కాదు కానీ వాటికంటే ప్రమాదకరమైనవే అక్కడ తిరుగాడుతున్నాయి. అందుకే అక్కడ ఎవరూ అడుగుపెట్టరు. పెట్టకూడదనే నిబంధన ఉంది. నరమానవులకు అక్కడ నిషేధం. ఆ భయంకరమైన దీవి ఎక్కడుందో తెలుసుకుందాం!

బ్రెజిల్‌(Brazil) పక్కనే అట్లాంటిక్‌ మహాసముద్రంలో(Atlantic Sea) ఈ ద్వీపం(Island) ఉంది. బ్రెజిల్‌ తీర ప్రాంతం సావోపా(Savopa) నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దగ్గరే కదా అని పడవేసుకుని వెళితే మాత్రం వెనక్కి పడవే వస్తుంది కానీ వెళ్లిన వారు రారు. ఎందుకంటే ఆ దీవి నిండా పాములే(Snake)! అడుగడుగునా పాములుంటాయి. ఈ ద్వీపం పేరు సావోపౌల్‌.. ఇల్హా డా క్యూమాడా గ్రాండే.. సుమారు 110 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఇందులో కనీసం నాలుగున్నర లక్షల(4.5 Lakhs Snakes) పాములుంటాయి. ఇక్కడ సంచరిస్తున్న పాములు మామూలువి కావు. కొన్ని కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. కొన్నైతే మనిషిని పీల్చి పిప్పి చేయగలవు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన వైపర్లలో ఒకటైన గోల్డెన్‌ లాన్స్‌హెడ్‌ పాములు ఇక్కడ తిరుగాడుతుంటాయి. ఈ పాములే నాలుగు వేల వరకు ఉంటాయిక్కడ. అందుకే ఇక్కడ పాములు తప్ప మరే జీవరాశి బతికి బట్టకట్టలేదు. ఎగురుకుంటూ వెళ్లే చిన్నా చితకా పక్షులే వాటికి ఆహారం. 1920 వరకు ఇక్కడ జనం నివసించేవారట! తర్వాతర్వాత కూడా ఇక్కడి లైట్‌హౌస్‌ను ఆపరేట్‌ చేసేందుకు ఓ మనిషి ఉండేవాడట! అతడిని కూడా పాము కరచి చంపేసిందట! అప్పట్నంచి నరులెవ్వరూ అక్కడ అడుగు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది! అయితే జీవశాస్త్రవేత్తలు, పరిశోధకులు మాత్రం పర్మిషన్‌ తీసుకుని వెళ్లవచ్చు.

Updated On 8 July 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story