మన సౌత్ హీరోలు(South Heros) రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నారు. సినిమాల పరంగానే కాదు సోషల్ మీడియా(Social Media)లో కూడా రికార్డ్ లుతిరగ రాస్తున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu).. రేర్ ఫీట్ సాధిస్తే.. ఇప్పుడు ఇళయదళపతి విజయ్(Ilayathalapathy Vijay) కూడా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు(New Record) క్రియేట్ చేశారు. ఇంతకీ విజయ్ సాధించిన రికార్డ్ ఏంటీ..?

తళపతి విజయ్(Thalapathy Vijay)..తమిళం(Tamil)లో మాత్రమే కాదు తెలుగు(Telugu)లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో. రీసెంట్ గా వారసుడు సినిమా(Varasudu Movie)తో డైరెక్ట్ గా తెలుగు మార్కెట్ మీద టార్గెట్ పెట్టిన విజయ్ అందులో కాస్త సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. వారసుడు గా టాలీవుడ్ కు వచ్చి.. టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం లియో మూవీతో బిజీగా ఉన్నాడు. ఇదంతా అలా ఉండగానే ఇప్పుడు ఓ విషయంలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు విజయ్.

ప్రస్తుతం ఏ స్టార్ అయినా సరే వెండితెరతో పాటు.. సోషల్ మీడియాలో కూడా క్రేజ్ సాధించాల్సిందే. ఇప్పటికే హీరోయిన్లు సోషల్ మీడియా(Social Media)లో రెచ్చిపోయి చూపించేస్తున్నారు. ఇక హీరోలు కూడా తమ అప్ డేట్స్.. స్పెషల్ లుక్స్ కోసం సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. వాలిని ఫాన్స్ ఓ రేంజ్ లో పైకి లేపుతున్నారు. ఈక్రమంలోనే విజయ్ దళపతి. కొత్తగా ఇన్ స్టా గ్రామ్(Instagram) అకౌంట్ ఓపెన్ చేశాడు. కొందరు సెలబ్రిటీలు చాలా లిమిటెడ్ గా సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో విజయ్ కూడా ఒకరు. అలాంటిది విజయ్ ఇన్ స్టాలోకి రాగానే ఫ్యాన్స్ ఆయనతో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయ్యేలా చేశారు. అదేంటంటే..?

ఇప్పటివరకు ట్విట్టర్(Twitter) లో మాత్రమే ఉన్న విజయ్.. తాజాగా ఇన్ స్టాలోకి ఎంట్రీ(Insta Entry) ఇచ్చాడు. ఈ క్రమంలోనే 1 మిలియన్ ఫాలోవర్స్(1M Followers) ని కేవలం 97 నిమిషాల్లోనే అందుకున్నాడు. ఇంత ఫాస్ట్ గా 1 మిలియన్ మార్క్ ని అందుకున్న తొలి ఇండియన్ యాక్టర్(1st India Actor) గా విజయ్ రికార్డ్(Vijay Record) సాధించాడు. అంతే కాదు వరల్డ్ వైడ్(World Wide) ఇలాంటి ఫీట్ సాధించిన మూడోవ నటుడిగా నిలిచాడు. విజయ్ కంటే ముందు బీటీఎస్(BTS) 43 నిమిషాల్లో, నటి ఏంజెలీనా జోలీ(actress Angelina Jolie ) 59 నిమిషాల్లో.. మిలియన్ ఫాలోవర్స్(Milion Followers) ని సొంతం చేసుకున్నారు.

Updated On 3 April 2023 4:35 AM GMT
Ehatv

Ehatv

Next Story