సాధారణంగా ప్రతి ఒక్కరికీ శృంగారం (Romance) చాలా ముఖ్యం. శృంగారంతో శారీరకంగా, మానసికంగా (Mentally) సంతృప్తి చెందుతుంటారు. శృంగారంలో తరుచూ పాల్గొంటే చురుకుగా ఉంటారని చెప్తుంటారు. కానీ శృంగారానికి ముందు, తర్వాత ప్రైవేట్‌ పార్ట్స్‌ను (Private parts) శుభ్రం చేసుకోకుంటే ఇన్‌ఫెక్షన్లు(Infections) సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు (Doctors) హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్‌ పార్ట్స్‌ శుభ్రతపై మనుషులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.

సాధారణంగా ప్రతి ఒక్కరికీ శృంగారం (Romance) చాలా ముఖ్యం. శృంగారంతో శారీరకంగా, మానసికంగా (Mentally) సంతృప్తి చెందుతుంటారు. శృంగారంలో తరుచూ పాల్గొంటే చురుకుగా ఉంటారని చెప్తుంటారు. కానీ శృంగారానికి ముందు, తర్వాత ప్రైవేట్‌ పార్ట్స్‌ను (Private parts) శుభ్రం చేసుకోకుంటే ఇన్‌ఫెక్షన్లు(Infections) సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు (Doctors) హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్‌ పార్ట్స్‌ శుభ్రతపై మనుషులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.

మీరు తరచుగా శృంగారంలో పాల్గొంటున్నారా.. అయితే శృంగారంలో పాల్గొనకముందు, ఆ తర్వాత ప్రైవేట్‌ పార్ట్స్‌ను శుభ్రపర్చుకోకుంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందట. ముఖ్యంగా మహిళలకు (Female) ఈ ఇన్‌ఫెక్షన్ల బెడద ఎక్కువుగా ఉంటుందట. ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ (Yeast infection), వాగినోసిస్‌ (Bacterial vaginosis) వంటి సమస్యనే కాకుండా ఎయిడ్స్‌ (AIDS) కూడా సోకే ప్రమాదం ఉందంటున్నారు. వ్యక్తులతో సంభోగించే (Intercourse) సమయంలో ఇలాంటి బ్యాక్టీరియాలు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉండదని చెప్తున్నారు. ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర ఉండే జుట్టు జెర్మ్స్(Germs) బ్యాక్టీరియాను వ్యాపింపచేస్తుందని చెప్తున్నారు. జననేంద్రియాల దగ్గర హెయిర్‌ను (vaginal hair)ఎప్పటికప్పుడు ట్రిమ్‌(Trim) చేసుకోవాలని చెప్తున్నారు. షేవ్‌ (Shave) చేస్తే అక్కడ ఉండే పొర తొలగిపోయి, ఇబ్బందిగా ఫీలవుతారని అంటున్నారు. లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు పార్టనర్స్‌ (Partners) ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు సహజం. ఇక్కడే మరో సమస్య కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి శుభ్రత (Mouth Freshness) చాలా చాలా ముఖ్యమని తెలుపుతున్నారు. లిప్‌కిస్‌, ఇతర ప్రదేశాల్లో కిస్‌ చేయడం వల్ల కూడా బ్యాక్టిరియా సోకే అవకాశం ఉందంటున్నారు. ఇందుకుగాను సెక్స్‌కు ముందు, తర్వాత మౌత్‌ వాష్‌(Mouth wash) చేసుకోవడం మంచిదంటున్నారు. మౌత్‌ ఫ్రెషనర్లు, చూయింగ్‌ గమ్స్‌ (Chewing gum) వల్ల కూడా బ్యాక్టీరియాను నివారించే అవకాశముందని తెలుస్తోంది. అంతేకాకుండా నోటి నుంచి దుర్వాసన వస్తే పార్ట్‌నర్‌ ఇబ్బందిగా ఫీల్‌ అవుతారని, తరుచుగా నోటిని శుభ్రం చేసుకుంటే దుర్వాసనను కూడా అరికట్ట వచ్చంటున్నారు.

కొందరు టూర్లు (Tours) వెళ్లినప్పుడు బీచ్‌లలో(Beach) సెక్స్‌కు మొగ్గు చూపుతారు. ఈ ప్రదేశాల్లో సెక్స్‌ చేయకపోవడమే ఉత్తమమని చెప్తున్నారు. బీచ్‌లలో ఈ చర్యలకు పాల్పడితే ఇసుక (Sand), నీరు (Water) శరీరంలోకి వెళ్తే ఇన్‌ఫెక్షన్లకు గురవుతారని నిపుణులు (Experts) అంటున్నారు. మురికిగా ప్రదేశాలను కూడా అవాయిడ్‌ చేయాలని అంటున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే జననేంద్రియాల నుంచి వచ్చే దుర్వాసనకు కూడా దూరమవుతారని సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు యోని (vagina) శుభ్రత విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు. సెక్స్‌కు ముందు, తర్వాత యోనిని శుభ్రం చేసుకుంటే ఇన్‌ఫెక్లన్లకు దూరమవుతారని అంటున్నారు. సంభోగం తర్వాత కచ్చితంగా గోరువెచ్చని నీటితో (warm water) యోనిని శుభ్రం చేసుకోవాలని లేదంటే బ్యాక్టీరియా వేగంగా చొచ్చుకెళ్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ప్రైవేట్‌ పార్ట్స్‌ను నిర్లక్ష్యం చేయొద్దని, ఇలాంటి జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

Updated On 23 Nov 2023 1:59 AM GMT
Ehatv

Ehatv

Next Story