Twinstrangers : మీలాంటి వారు ఇంకొకరు ఉన్నారని తెలుసా.. ఐతే ఇలా తెలుసుకోండి.!
మనలాంటోళ్లు ఎక్కడో ఓ చోట ఉండే ఉంటారు.. అందుకే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు అంటుంటారు.. అసలు మనవాలంటి వాళ్లు ఎదురుపడితే చూడాలన్న కోరిక మా బాగా ఉంటుంది.. అలాంటి వారిని వెతకడం ఒకప్పుడంటే కష్టమేమో కానీ, టెక్నాలజీ ఇంతగా పెరిగిపోయిన ఈ కాలంలో కొంత వీజీనే! ఇలాంటి వారిని వెతకడం కోసం ఓ వెబ్‌సైట్, ఓ యాప్ వచ్చాయి. అదే Twinstrangers.com అనే వెబ్‌సైట్. ఇదే పేరుతో ఓ యాప్ కూడా ఉంది. […]
మనలాంటోళ్లు ఎక్కడో ఓ చోట ఉండే ఉంటారు.. అందుకే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు అంటుంటారు.. అసలు మనవాలంటి వాళ్లు ఎదురుపడితే చూడాలన్న కోరిక మా బాగా ఉంటుంది.. అలాంటి వారిని వెతకడం ఒకప్పుడంటే కష్టమేమో కానీ, టెక్నాలజీ ఇంతగా పెరిగిపోయిన ఈ కాలంలో కొంత వీజీనే! ఇలాంటి వారిని వెతకడం కోసం ఓ వెబ్‌సైట్, ఓ యాప్ వచ్చాయి. అదే Twinstrangers.com అనే వెబ్‌సైట్. ఇదే పేరుతో ఓ యాప్ కూడా ఉంది. ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించి చాలా మంది తమను పోలిన వారి వివరాలు కనుక్కోగలిగారట. కొందరైతే కలుసుకున్నారు కూడా. ఇలా కలుసుకున్నవారిలో అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన అంబ్రా, టెక్సాస్‌కు చెందిన జెన్నిఫర్ ఉన్నారు. ఇద్దరూ ఒక వయసు వారేమీ కాదు.. ఓ పదేళ్ల తేడా ఉంటుంది.. కాకపోతే ముఖ కవళికలు మాత్రం అచ్చంగా అచ్చుగుద్దినట్టే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌లో కోటి మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఫస్ట్ మనం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. మన ఫోటోను అందులో అప్‌లోడ్ చేయాలి. సైడ్ లుక్ ఉన్న ఫోటోలు పని చేయవు. అలాగే ముఖంపై వెంట్రుకలు పడకుండా చూసుకోవాలి. కళ్లు, ముక్కు, నోరు, చెవులు అన్ని క్రిస్టల్ క్లియర్‌గా ఉండాలి. ఆ తరువాత మన జెండర్, పేరు, ఊరు, దేశం వివరాలన్నీ సబ్మిట్ చేయాలి. ప్రొఫైల్ గ్యాలరీలో మరో ఐదు రకాల ఫొటోలను అదనంగా యాడ్ చేయాలి. వెబ్‌సైట్‌లో కృత్రిమ మేధ సహాయంతో మన పోలికలు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి కొంత నగదు చెల్లించాలి. ఇప్పుడు మన ప్రొఫైల్ ఆధారంగా అప్పటికే రిజస్టర్ అయిన వారి ముఖాలను పోలుస్తూ.. అందులో మనలాగే ఉన్నవారి ఫొటోలను గుర్తించి ఒక ఫోల్డర్లో పంపిస్తుంది. మనకు తగ్గ వ్యక్తి దొరికితే వారిని మై ట్విన్స్ ఫోల్డర్‌లోకి పంపించాలి. అప్పుడు అవతలి వ్యక్తి కూడా మనతో పరిచయం పెంచుకోవడానికి వీలుంటుంది. విభిన్న రకాల ఫొటోలు జత చేసే కొద్దీ మన పోలికలు ఉన్న మరింత మంది వ్యక్తులను ఈ వెబ్‌సైట్‌లోని టెక్నాలజీ వెతికిపెడుతుంది.