మహిళలు(Women) ఎలాంటి బ్రా(Bra) వేసుకోవాలి.. సైజుకు(Size) తగ్గట్టుగా బ్రా ధరించకుంటే దుష్ఫలితాలు వస్తాయా.. మహిళలు బ్రా కొనుగోలు చేసినప్పుటు పొరపాట్లు చేస్తున్నారని లండన్లోని(London) సెయింట్ జార్జ్ ఆస్పత్రి(St George's Hospital) ప్రొఫెసర్ కిఫా మాక్బెల్(Professor Kefah Mokbel) వెల్లడించారు. బ్రా వ్యాపారం బిలియన్ డాలర్లకు(Billion Dollars) విస్తరించినా.. 10 మందిలో 8 మంది సరైన సైజ్ బ్రా ధరించడం లేదంటున్నారు. దాదాపు 80 శాతం మహిళలు తమ సైజుకన్నా చిన్నదిగా(Small size) లేదా పెద్దదిగా(big size) ఉన్న సైజ్ను ధరిస్తున్నారని తెలిపారు. మహిళలు తమ వీపు పరిమాణాన్నికొలిచేటప్పుడు(Measuring) పొరపాటు చేస్తుంటారని.. సాధారణంగా వీపు సైజును 4 అంగుళాలు(4 inches) తక్కువగా, వాస్తవ రొమ్ము(Chest) పరిమాణాన్ని 3 అంగుళాల వరకు ఎక్కువగా కొలుస్తుంటారు అని కిఫా చెప్పారు

poster
-
- తప్పుడు సైజు(Wrong Size) బ్రాను ఎక్కువ కాలం వేసుకుంటే మెడ నొప్పి(Neck Pain), వీపు నొప్పి(Back Pain) వస్తుందన్నారు. కొన్నిసార్లు ఇది సర్జరీలకు(Surgery) కూడా దారితీస్తుందని ప్రొఫెసర్ కిఫా చెప్పారు. భుజం నొప్పి(Shoulder Pain), మెడ నొప్పి, రొమ్ము నొప్పి వంటివి దీర్ఘకాలికంగా వేధిస్తాయన్నారు. బిగుతుగా ఉండే బ్రా పట్టీల(Bra Straps) వల్ల చర్మంపై దద్దుర్లు, మచ్చలు(Marks) ఏర్పడతాయన్న కిఫా.. బ్రా ఒత్తిడి కారణంగా రొమ్ముల్లో నొప్పి వచ్చే(Chest pain) అవకాశముందని చెప్పారు. తప్పుడు సైజు బ్రా ధరించడం వల్ల శరీర ఆకృతి(Body stature) కూడా అట్రాక్టివ్గా(Attract) కనిపించదని చెప్పారు. ఈ సమస్యలను(Problems) నివారించేందుకు సరైన బ్రాను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
-
- మరి సరైన బ్రాను ఎలా ఎంచుకోవాలన్న ప్రశ్నకు సమాధానంగా శరీరానికి సరిపోయి, సౌకర్యంగా ఉండే బ్రాను ధరించాలని సూచిస్తున్నారు. మార్కెట్లో(Market) అండర్వైర్డ్(Underwire Bra), ప్యాడెడ్(Padded), బ్రాలెట్(Bralette), పుషప్స్(Push Up Bras).. ఇంకా చాలా రకాల బ్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో చాలా రకాల సైజులుంటాయన్నరు. ముఖ్య ఏ, ఏఏ, బీ, సీ, డీ(A, AA, B, C, D) అనే కప్ సైజలుంటాయని.. వీటిలో సరైన సైజ్ చూసి ఎంపిక చేసుకోవాలంటున్నారు.
-
- ఎవరికి ఎలాంటి సైజ్ సరిపోతుందో తనకు తెలుసని యూకేలోని కాన్సెంట్ సిటీలో(Concent city) ఉన్న మహిళ సెడీ(Sadie) అంటోంది. సరైన సైజు బ్రా ధరించిన మహిళలను తాను వెంటనే గుర్తిస్తానని సెడీ చెప్పొకొచ్చింది. సైజ్గైడ్లో(Size guide) ఉండే కొలతలు సరిగా ఉండవని.. దీంతో మహిళలు రాంగ్ సైజ్(Wrong size) బ్రాలు ధరిస్తారని సెడీ చెప్తోంది. మహిళల వీపు పరిమాణాన్ని కొలిచి, భుజాల మీదుగా కొలత తీసుకొని వారికి తగిన బ్రాను సూచిస్తామని తెలిపింది. మంచి బ్రా ధరిస్తే మహిళల్లో ఆత్మవిశ్వాసం(Self confidence) పెరుగుతుందని సెడీ వివరిస్తోంది.
-
- అయితే మీ సైజ్ను ఇప్పుడు ఎలా కొలవాలో చూద్దాం.. ఇందుకు మీ స్నేహితురాలి(Friend) సాయం అవసరం.. మొదట బ్రెస్ట్(Breast) కింది భాగాన్ని కొలవండి. దానికి 5 అంగుళాలను కలిపితే మీ వీపు సైజు అవుతుంది. ఉదాహరణకు బ్రెస్ట్ కింద స్ట్రాప్ సైజు(Strap size) 28 అంగుళాలు ఉంటే... దానికి 5 అంగుళాలు కలపడంతో.. మీ వీపు సైజు 33 అంగుళాలు అవుతుంది. ఒకవేళ బ్రెస్ట్ కింది భాగం 33 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, దానికి 3 అంగుళాలు మాత్రమే కలపాలి. అప్పుడు వీపు సైజు 36 అంగుళాల అని తెలుసుకోవాలి. ఇకపోతే కప్ సైజు(Cup Size) విషయానికొస్తే.. చనుమొనల(Nippels) మీదుగా బ్రెస్ట్ కొలతను చూడాలి.. దీనిని వీపు సైజు నుంచి తీసివేయగా మిగిలిన సైజ్ కప్ సైజు అన్నమాట. ఉదాహరణకు బస్ట్ సైజు 36 ఉండి, వీపు సైజు కూడా 36 ఉంటే.. వాటి మధ్య తేడా 0 అంగుళాలు అవుతుంది. 0 అంగుళాలు- ఏఏ, 1 అంగుళం- ఏ, 2 అంగుళాలు- బి, 3 అంగుళాలు- సి, 4 అంగుళాలు- డి, 5 అంగుళాలు- డిడి. చూశారుగా బ్రా సైజ్ ఎలా గుర్తించాలో..
