మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడినపుడు... ఒకప్పటి ఆహారమే మంచిదని ..ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కాదని గుర్తు చేసుకుంటూ ఉంటాము .ఒకప్పుడు వంట చెయ్యాలి అంటే కట్టెల పొయ్యి మీద ...మట్టి కుండల్లో వంట చేసుకుని తినేవారు ..అది ఎంతో ఆరోగ్యకరమైన అలవాటుగా చెప్పుకోవచ్చు..టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది జీవన విధానం లో చాలా మార్పులు వచ్చాయి.. ఆ తర్వాత అల్యుమినియుం , స్టీల్, ఇత్తడి […]

మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడినపుడు... ఒకప్పటి ఆహారమే మంచిదని ..ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కాదని గుర్తు చేసుకుంటూ ఉంటాము .ఒకప్పుడు వంట చెయ్యాలి అంటే కట్టెల పొయ్యి మీద ...మట్టి కుండల్లో వంట చేసుకుని తినేవారు ..అది ఎంతో ఆరోగ్యకరమైన అలవాటుగా చెప్పుకోవచ్చు..టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది జీవన విధానం లో చాలా మార్పులు వచ్చాయి.. ఆ తర్వాత అల్యుమినియుం , స్టీల్, ఇత్తడి పాత్రలు వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో రైస్ కుక్కర్లు దర్శన౦ ఇస్తున్నాయి . ఈ ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో వంట చేసుకునే టైం సరిపోక ఎక్కువ మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పైనే ఆధార పడుతున్నారు . రైస్ కుక్కర్ లో వండుకున్న ఆహారం తినడం వల్ల అనేక రోగాల బారిన పడుతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు .

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన ఆహారం తినడం వల్ల వయసుతో సంబ౦ధం లేకుండా మోకాళ్ళ నొప్పులు , కీళ్ళ నొప్పులు వస్తాయి .ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సీన్ మెటల్ తో తయారవుతుంది . ఇక ఇందులో అన్నాన్ని ఉడికించడం వల్ల పోషకాలు కనుమరుగు అవుతాయి . నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న కుక్కర్లను వాడొద్దని నిపుణులు చెపుతున్నారు .నాన్ స్టిక్ వస్తువులను ఉపయోగించి వంట చేయడం వల్ల వాటి నుంచి కెమికల్స్ విడుదల అవుతాయి . దీంతో అవి క్యాన్సర్ కు దారి తీస్తాయి .

అంతే కాదు రైస్ కుక్కర్లు ఎక్కువగా అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచి పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ కుక్కర్ లో చేసిన రైస్ తినడం వల్ల గ్యాస్ సమస్యలు , ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, , అధిక బరువు, నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంద౦టున్నారు నిపుణులు. అందుకే వంట కాస్త లేట్ అయిన లేటెస్ట్ పాత్రల కంటే పాత పద్ధతిలో మట్టి పత్రాలు స్టీల్ పాత్రలు ఉపయోగించడం ఆరోగ్యానికి ఏంతో మేలు .

Updated On 22 Feb 2023 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story