వంట(cooking) చేస్తూ కూడా ప్రపంచ రికార్డు సృష్టించవచ్చు. నైజీరియాకు(Nigeria) చెందిన మహిళా చెపఫ్‌ హిల్దా బాసి ఇలాగే రికార్డు సాధించారు. ఆమె ఏం చేసిందంటే వంద గంటల పాటు ఏకబిగిన వంట చేశారు. అమ్మో.! వంద గంటలే...! కిచెన్‌లో గంటపాటు ఉండటమే కష్టం అనుకునేవారు బాసి సాధించిన ఘనత చూసి కళ్లు తిరిగి పడి ఉంటారు.

వంట(cooking) చేస్తూ కూడా ప్రపంచ రికార్డు సృష్టించవచ్చు. నైజీరియాకు(Nigeria) చెందిన మహిళా చెఫ్‌ హిల్దా బాసి(Hilda basi) ఇలాగే రికార్డు సాధించారు. ఆమె ఏం చేసిందంటే వంద గంటల పాటు ఏకబిగిన వంట చేశారు. అమ్మో.! వంద గంటలే...! కిచెన్‌లో గంటపాటు ఉండటమే కష్టం అనుకునేవారు బాసి సాధించిన ఘనత చూసి కళ్లు తిరిగి పడి ఉంటారు. బాసికి ముందు ఈ రికార్డు మన దేశానికి చెందిన లతా ఠాండన్‌ పేరిట ఉండింది. 2019లో ఆమె 87 గంటలా 45 నిమిషాల పాటు వంట చేసి రికార్డు నెలకొల్పింది. హిల్దా బాసి గత గురువారం లాగోస్‌లోని లెక్కి ప్రాంతంలో
వంట వండటం స్టార్ట్‌ చేసింది. లండన్‌ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.45 గంటలకు అది పూర్తయ్యింది.

ఈ వంద గంటల్లో ఆమె నైజీరియా ప్రత్యేక వంటకాలైన సూప్‌లు, టొమాటో రైస్‌ వంటి పలు డిష్‌లను అవలీలగా వండేసింది. 12 గంటల పాటు ఏకబిగిన వంట చేసి.. ఓ గంటపాటు విశ్రాంతి తీసుకునేది. ఆ గంట సమయంలో స్నానం, వైద్య పరీక్షలు, ఆకలిదప్పులు తీర్చుకోవడం, ఇతర పనులు పూర్తి చేసుకునేది. అసలు హిల్దా బాసి రికార్డు సాధిస్తుందో లేదో అన్నది చూసేందుకు లెక్కలేనంత మంది లెక్కి ప్రాంతానికి వచ్చారు. కొందరు పాటలు పాడుతూ ఆమెను ప్రోత్సహించారు. ఈ వంట కార్యక్రమం ఆన్‌లైన్‌లో లైవ్‌ టెలికాస్ట్‌ అయ్యింది. రికార్డు కోసమని వంటలను హడావుడిగా చేయలేదు. ఆమె చేసిన ప్రతి వంట రుచిగానే ఉంది. రికార్డు నెలకొల్పగానే నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ బాసికి కంగ్రాట్స్‌ తెలిపారు. ఆఫ్రికన్‌ మహిళలకు సంఘీభావంగానే తాను ఈ సాహసానికి పూనుకున్నానని బాసి తెలిపారు. ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ వారు అధికారికంగా హిల్దా బాసి రికార్డును ప్రకటించడమే తరువాయి!

Updated On 16 May 2023 11:22 PM GMT
Ehatv

Ehatv

Next Story