ఫోటోలో ఉన్న పింగాణీ గిన్నె(Ceramic Bowl) రేటు ఎంతుంటుంది? మహా అయితే ఓ వంద రూపాయలు ఉంటుందేమో! ఆ గిన్నె మీద ఉన్న ఆర్ట్‌ వర్క్‌(Art Work)కు ఇష్టపడి మరో యాభై రూపాయలు ఎక్సట్రా ఇవ్వొచ్చు. అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువిచ్చినా వేస్టే! ఇలా అనుకుంటున్నారు కదూ! ఇప్పుడు ఆ పింగాణీ గిన్నే రేటెంతో చెబుతాను.. హైబీపీ(High BP) ఉన్నవాళ్లు గుండెను గట్టిగా పట్టుకోండి.. అక్షరాలా 200 కోట్ల రూపాయలు..రెండు పక్షులు, ఆప్రికాట్‌ చెట్టు పెయింటింగ్‌ ఉన్న ఆ పింగాణీ గిన్నెను మొన్న వేలం వేశారు.. వేలం పాటలో ఓ వ్యక్తి 25 మిలియన్‌ డాలర్లు ఇచ్చి కొనుక్కున్నాడు.

ఫోటోలో ఉన్న పింగాణీ గిన్నె(Ceramic Bowl) రేటు ఎంతుంటుంది? మహా అయితే ఓ వంద రూపాయలు ఉంటుందేమో! ఆ గిన్నె మీద ఉన్న ఆర్ట్‌ వర్క్‌(Art Work)కు ఇష్టపడి మరో యాభై రూపాయలు ఎక్సట్రా ఇవ్వొచ్చు. అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువిచ్చినా వేస్టే! ఇలా అనుకుంటున్నారు కదూ! ఇప్పుడు ఆ పింగాణీ గిన్నే రేటెంతో చెబుతాను.. హైబీపీ(High BP) ఉన్నవాళ్లు గుండెను గట్టిగా పట్టుకోండి.. అక్షరాలా 200 కోట్ల రూపాయలు..రెండు పక్షులు, ఆప్రికాట్‌ చెట్టు పెయింటింగ్‌ ఉన్న ఆ పింగాణీ గిన్నెను మొన్న వేలం వేశారు.. వేలం పాటలో ఓ వ్యక్తి 25 మిలియన్‌ డాలర్లు ఇచ్చి కొనుక్కున్నాడు. మన కరెన్సీలో 200 కోట్ల రూపాయలు. పురాతన వస్తువులను వేలం వేసే అమెరికాకు చెందిన ఓ ప్రముఖ సంస్థ సోథిబె(sotheby)మొన్న హాంకాంగ్‌(Hong Kong)లో ప్రత్యేకంగా ఓ వేలంపాట నిర్వహించింది. 40 దేశాలలో 80 ప్రాంతాలలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ కంపెనీ గోల్డెన్‌ జూబ్లీ(Golden jubilee) జరుపుకుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకునే ఈ వేలం పాట నిర్వహించింది. ఇందులోనే ఈ పింగాణీ గిన్నె కూడా వేలానికి వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే చైనా రాజధాని(China Capital) బీజింగ్‌(Beijing)లో 1722-35 మధ్యన యోంగ్‌జింగ్ పాలన చేసేవాడు. ఆయన చనిపోయిన కొద్ది కాలానికి ఫలాంగ్‌కాయ్‌, ఫారిన్‌ కలర్స్‌ అని పిల్చుకునే సంప్రదాయంలో భాగంగా సిరామిక్స్‌తో ఈ గిన్నెను తయారు చేశారు. గిన్నె మీద రెండు పక్షులు, ఆప్రికాట్‌ చెట్టు బొమ్మలతో పాటు యోంగ్‌జెంగ్ వంశానికి చెందిన రాజు కవితల నుంచి కొన్ని పదాలు ఉన్నాయి. అప్పుడు ఇలాంటి గిన్నెలను రెండే తయారు చేశారు. 19వ శతాబ్దం చివరలో షాంఘైకి చెందిన షిప్పింగ్ వ్యాపారి కెప్టెన్ చార్లెస్ ఓస్వాల్డ్ లిడ్డెల్ నుంచి వీటిని సేకరించారు. 1929లో వీటిని 150 పౌండ్లకు విడివిడిగా అమ్మారు. వీటిలో ఒకటి లండన్‌(London)లోని బ్రిటిష్ మ్యూజియం(British Museum)లో ఉందని సోథెబీస్ తెలిపింది. రెండో దానిని హాంకాంగ్‌లో తాజాగా వేలం వేశారు. ఈ గిన్నె అనేక మంది చేతులు మారింది. అమెరికాకు చెందిన బార్బరా హట్టన్‌ సైతం వేలం పాటలో ఈ గిన్నెను దక్కించుకున్నారు. ఇక ఏప్రిల్‌ 8న వేసిన వేలంలో ఆ గిన్నెను వ్యాపారవేత్త, కలెక్టర్ అలిస్ చెంగ్ కొనుకున్నారు.

Updated On 11 April 2023 5:11 AM GMT
Ehatv

Ehatv

Next Story