నటుడు విజయకాంత్‌(Vijaykanth) మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటే! అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయకాంత్‌ గురువారం ఉదయం చనిపోయారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కెప్టెన్‌తో(Captain) తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సంతాపం తెలియచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కోయంబేడులోని డీఎండీకే(DMDK) కేంద్ర కార్యాలయంలో విజయకాంత్‌ అంత్యక్రియలు జరుగుతాయి.

నటుడు విజయకాంత్‌(Vijaykanth) మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటే! అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయకాంత్‌ గురువారం ఉదయం చనిపోయారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కెప్టెన్‌తో(Captain) తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సంతాపం తెలియచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కోయంబేడులోని డీఎండీకే(DMDK) కేంద్ర కార్యాలయంలో విజయకాంత్‌ అంత్యక్రియలు జరుగుతాయి. తాజాగా హీరో విశాల్‌(Hero Vishal) కెప్టెన్‌ మరణంపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణవార్తను తట్టుకోలేకపోయారు. వెక్కి వెక్కి ఏడ్చాడు. విజయకాంత్‌తో తనకున్న అనుబంధాన్ని చెబుతూ వీడియో రిలీజ్(Viedo Release) చేశారు. ఆ వీడియోలో విశాల్‌ ఏమన్నారంటే 'నా జీవితంలో నేను కలిసిన అత్యంత ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరైన కెప్టెన్‌ విజయకాంత్‌ అన్న మరణవార్త విన్న తర్వాత నాకు కాళ్లుచేతులు ఆడలేదు. కెప్టెన్ లేడు అన్న మాట నేను ఉహించుకోలేకపోతున్నాను. ఆయన నుంచి నేను సామజికసేవ(Social service) నేర్చుకున్నాను. కెప్టెన్ అన్నా.. ఈ రోజు వరకు మిమ్మల్ని అనుసరిస్తున్నాను మరియు మీ పేరు మీద అలానే ఉంటాను. మన సమాజానికి అవసరమయ్యే అలాంటి వారిని దేవుడు ఎందుకు అంత త్వరగా దూరం చేస్తాడు. మిమ్మల్ని చివరిసారి చూడడానికి అక్కడ లేనందుకు చింతిస్తున్నాను. నాకు స్ఫూర్తి ఇచ్చిన యోధుడు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మీరు చాలా కాలం గుర్తుండిపోతారు. ఎందుకంటే ప్రజలకు మరియు నడిగర్ సంఘం కోసం మీరు చేసిన సేవ ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది' అని విశాల్‌ చెప్పారు.

Updated On 28 Dec 2023 7:56 AM GMT
Ehatv

Ehatv

Next Story