Ajith Kumar Carries Woman Baby Bag Photo Viral : హీరో అజిత్ గొప్ప మనసు చాటుకున్నాడు, సెల్ఫీ అడిగిన లేడి ఫ్యాన్ బ్యాగు మోసాడు!
తమిళ స్టార్ హీరో(Tamil Star Hero) అజిత్‌కుమార్(Ajith Kumar)కు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే! ఆయన సింప్లిసిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. ప్రజలలో ఇట్టే కలిసిపోతారు. అభిమానుల్లో ఎవరికైనా కష్టం వస్తే తానున్నానంటూ ముందుకొస్తారు. సాయం అందిస్తారు.
తమిళ స్టార్ హీరో(Tamil Star Hero) అజిత్‌కుమార్(Ajith Kumar)కు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే! ఆయన సింప్లిసిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. ప్రజలలో ఇట్టే కలిసిపోతారు. అభిమానుల్లో ఎవరికైనా కష్టం వస్తే తానున్నానంటూ ముందుకొస్తారు. సాయం అందిస్తారు. లేటెస్ట్‌గా జరిగిన ఓ ఇన్సిడెంట్‌తో ఆయన వ్యక్తిత్వం ఆకాశాన్ని అంటింది. జనరల్‌గా స్టార్ హీరో కనిపిస్తే ఫ్యాన్స్ ఏం చేస్తారు? సెల్ఫీల కోసమో, ఆటోగ్రాఫ్‌ల కోసమో ఎగబడతారు. కొందరు హీరోలు చిరాకు పడకుండా ఫ్యాన్స్‌తో సెల్పీలు దిగుతారు. వారికి ఆటోగ్రాఫ్‌లు ఇస్తారు. ఒక్కోసారి మూడ్ బాగోలేకపోతే ఇవ్వరు. అజిత్ మాత్రం ఇప్పటి వరకు అలా చేయలేదు. ఒక్క సెల్ఫీ సార్ .. అని అడిగిన ఓ మహిళా అభిమానితో అజిత్ ఫోటో సెల్ఫీ దిగడమే కాదు, తన మంచి మనసు చాటుకున్నారు. పది నెలల బాబును చంకనెత్తుకుని, బ్యాగ్ మోయడానికి ఇబ్బంది పడుతున్న ఆమెకు సాయం చేశారు. ఆమె బ్యాగ్‌ను స్వయంగా విమానం వరకు మోసుకెళ్లారు. ఈ సంఘటన లండన్ ఎయర్‌పోర్టులో జరిగింది. ఈ విషయాన్ని ఆ మహిళ భర్త సోషల్ మీడియాలో పంచుకున్నారు.
' నా భార్య పది నెలల బాబుతో ఒంటరిగా గ్లాస్గో(Glasgow) నుంచి చెన్నై(Chennai)కు వస్తున్నది. ఈ సందర్భంగా లండన్ విమానాశ్రయం(London Airport)లో ఆమెకు హీరో అజిత్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో నా భార్య ఒళ్లో బాబు ఉన్నాడు. రెండు చేతుల్లో ట్రావెల్ సూట్‌కేసు, బేబి బ్యాగ్ ఉన్నాయి. నా భార్య ఇబ్బందిని గమనించిన అజిత్ నా భార్య చేతిలోని బేబీ బ్యాగును తీసుకున్నారు. వద్దని చెప్పినా వినలేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆ ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసని అంటూ అజిత్ బేబీ బ్యాగ్‌ను విమానం వచ్చే వరకు మోశారు. విమానం వచ్చిన తర్వాత ఆ బ్యాగును నా భార్య సీటు దగ్గర పెట్టాలని క్యాబిన్ సిబ్బందికి చెప్పారు. ఆ సమయంలో ఆయన చేతుల్లో ఓ సూటుకేసు కూడా ఉంది. అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి కూడా ఆయన సాధారణ వ్యక్తిగా వ్యవహరించారు. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన ఎంతో గొప్ప మనిషి' అంటూ సోషల్ మీడియాలో రాశారు. విచిత్రమేమిటంటే ఈ పోస్ట్ రాసినాయన విజయ్ ఫ్యాన్. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు అయితే అజిత్ మంచి మనుసుకు ఫిదా అవుతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.