Haryana Government : నూతన ఎక్సైజ్ పాలసీ.. జూన్ 12 నుంచి ఆఫీసులో మద్యం సేవించండి..!
హర్యానా ప్రభుత్వ నూతన ఎక్సైజ్ పాలసీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీని వెనుక కారణం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో కార్పొరేట్ కార్యాలయాల్లోని సిబ్బందికి మద్యం సేవించే వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఆఫీసులోనే(Office) ఉద్యోగులకు మద్యం అందించవచ్చు. అయితే, ఈ మినహాయింపు తక్కువ ఆల్కహాల్(Less Alcoholic) కలిగి ఉన్న పానీయాలకు మాత్రమే.

ఈ నిబంధనలు జూన్ 12 నుంచి అమలులోకి రానున్నాయి. ఎక్సైజ్ పాలసీ 2023-24 ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో బీర్, వైన్, డ్రింక్-టు డ్రింక్ వంటి తక్కువ వాల్యూమ్ ఆల్కహాలిక్ పానీయాలను అందించడం సాధ్యమవుతుంది. కనీసం 5,000 మంది ఉద్యోగులతో కూడిన కార్పొరేట్ కార్యాలయాల్లో బీర్, మద్యం, పానీయాలు సిద్ధంగా ఉంటాయి. పాలసీ ప్రకారం.. కార్పొరేట్ కార్యాలయంలో తక్కువ వాల్యూమ్ ఆల్కహాలిక్ పానీయాల వినియోగం కోసం లైసెన్స్ (L-10F) ప్రక్రియ ఉంటుంది. 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న కార్యాలయాలు లైసెన్స్ తీసుకోవచ్చు. ఇందుకోసం కంపెనీలు ఏటా రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
హర్యానా కేబినెట్ మంగళవారం కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24కి ఆమోదం తెలిపిందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడుతూ.. పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం ప్రభుత్వం రూ.400 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పర్యావరణ అనుకూలమైన చర్యగా ఫిబ్రవరి 29, 2024 తర్వాత మద్యం బాటిళ్లలో పెట్ (PET) బాటిళ్ల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలనుకున్నట్లు.. కొత్త మద్యం విధానం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.