అదృష్టం మనిషిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. బికారిని స్టార్ ను చేస్తుంది.. పేదవాడిని ధనవంతుడి మారుస్తుంది. గుడిసెలో ఉండేవాడిని బంగ్లాలోకి మారుస్తుంది. రీసెంట్ గా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ నటి ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక్క రోజులో కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..

అదృష్టం మనిషిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. బికారిని స్టార్ ను చేస్తుంది.. పేదవాడిని ధనవంతుడి మారుస్తుంది. గుడిసెలో ఉండేవాడిని బంగ్లాలోకి మారుస్తుంది. రీసెంట్ గా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ నటి ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక్క రోజులో కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..

చాలా మందికి చాలా అలవాట్లు ఉంటాయి అందులో కొన్ని వ్యాసనాలు కూడా ఉంటాయి. వాటి వల్ల ఒక్కోసారి లాభం వస్తే.. ఎక్కువ సార్లు నష్టమే మగులుతంది. అలాంటి వ్యసనాలలో లాటరీ కూడా ఒకటి. ఈ పేరు వినగానే చాలామంది ముఖం వెలిగి పోతుంది. డబ్బు పోగేసి వరుసగా కొనేస్తుంటారు. ఎప్పుడైనా తమకు లాటరీ తగలకపోతుందా అని ఎదురుచూస్తుంటారు. ఎప్పుడువరిస్తుందా అని ఎదురుచూస్తుంటారు మరికొంత మంది. అని కొందరు లాటరీ టికెట్స్ తెగ కొనేస్తుంటారు. అలా కొన్నిసార్లు అనుకోని రీతిలో ఒక్క దెబ్బకు కోటీశ్వరులు అయిపోతుంటారు. తాజాగా ఓ మలయాళ నటి(Malayalam actress) ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తికి అలాంటి జాక్ పాట్ తగిలింది. లాటరీలో ఏకంగా రూ.10 కోట్లు గెలిచేసుకున్నాడు.

మలయాళ నటి(Malayalam actress) నటి రజిని చాందీ(Rajini Chandy) ఇంట్లో.. అసోంకు చెందిన ఆల్బర్ట్ గిట్టా కొన్నేళ్ల నుంచి సహాయకుడిగా పనిచేస్తున్నాడు. వీరు కేరళ(Kerala)లోని కొచ్చిలో ఉంటున్నాడు. అయితే అతనికి ఒక అలవాటు ఉంది. లాటరీ టికెట్స్ కనిపించగానే కొనేస్తుంటాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా కేరళ ప్రభుత్వం సమ్మర్ బంపర్ లాటరీ టికెట్స్ ని అమ్మింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆల్బర్ట్.. వెంటనే వెళ్ళి ఓ టికెట్ ని కొన్నాడు. అయితే అది వస్తుందన్న నమ్మకం లేనప్పటికీ.. చూద్దాం అన్నట్టుగా కొనుగోలు చేసిన టికెట్ కు ఏకంగా 10కోట్ల లాటరీ తగిలింది. దాంతో ఒక్క సారిగా అతను కోటీశ్వరుడు అయ్యాడు.

ఆల్బర్ట్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నంబర్ SE222282 ఈ నెంబర్ పై ఏకంగా 10 కోట్లు గెలుచుకున్నట్లు ఆర్గనైజర్స్(Organizers) ప్రకటించారు. దీంతో ఆల్బర్ట్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కేవలం 250 పెట్టి టికెట్ కొంటే రూ.10 కోట్ల లాటరీ(Lottery) తగలడాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పాడు ఆల్బర్ట్. ఇక ఈ విషయంలో నటి చాందీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసింది. తన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న వ్యాక్తికి ఇలా అదృష్టం కలిసి రావడం ఆనందంగా ఉంది అని ఆమె ప్రకటించింది.

ఇక 10 కోట్ల లాటరీలో ట్యాక్సులన్నీ పోగా ఆల్బర్ ట్ చేతికి 6.5 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. అందుకు సంబంధించిన చెక్ ను ప్రభుత్వ అధికారులు ఇతడికి అందజేశారు. నటి రజిని చాందీ(Rajini Chandy) కూడా వెంట ఉండగా..ఆ చెక్ ను అందుకున్నాడు ఆల్బర్ట్. ఈ విషయంలో ఆమె ఎంతో సంతోషం వ్యాక్తం చేసింది. అంతే కాదు అక్కడ జరిగిన మరో విచిత్రం ఏటీ అంటే.. లాటరీ తగిలిని ముందురోజు.. ఎర్నాకులంలోని మరో పనివాడిని కూడా ఇలానే అదృష్టం వరించింది. అతను కూడా లాటరీ గెలుచుకున్నాడు కాని అతను 75 లక్షలు గెలుచుకున్నాడు.

Updated On 21 March 2023 10:57 PM GMT
Ehatv

Ehatv

Next Story