అది పెళ్లి రిసెప్షన్.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరూ ఉన్నారు. వేదికపై వధూవరులిద్దరూ నిలుచుకున్నారు. అక్కడేం జరిగిందో తెలియదు కానీ పెళ్లి కూతురుకు మాత్రం ఉన్నట్టుండి మస్తు కోపమొచ్చింది.. అప్పుడే ఆమెకు వరుడు స్వీట్‌ తినిపించే ప్రయత్నం చేశాడు. అంతే ఈ స్వీట్‌నుతీసుకుని విసిరికొట్టింది. పెళ్లి కొడుకు బిత్తరపోయాడు.. తర్వాత పెళ్లికొడుకుకు పెళ్లికూతురు పాయసం తాగేంచే ప్రయత్నం చేసింది.

సోషల్‌ మీడియా విస్తృతమయ్యాక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా చటుక్కుమని తెలిసిపోతోంది. ముఖ్యంగా చిత్రి విచిత్రమైన వీడియోలన్నీ సోషల్‌ మీడియాలో వచ్చేస్తున్నాయి. లేటెస్ట్‌గా ఓ వెడ్డింగ్‌ వీడియో వైరల్‌గా మారింది. కొత్తగా పెళ్లయిన జంటకు సంబంధించిన ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంతకీ ఆ పెళ్లిలో ఏం జరిగిందనుకున్నారు..?

అది పెళ్లి రిసెప్షన్.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరూ ఉన్నారు. వేదికపై వధూవరులిద్దరూ నిలుచుకున్నారు. అక్కడేం జరిగిందో తెలియదు కానీ పెళ్లి కూతురుకు మాత్రం ఉన్నట్టుండి మస్తు కోపమొచ్చింది.. అప్పుడే ఆమెకు వరుడు స్వీట్‌ తినిపించే ప్రయత్నం చేశాడు. అంతే ఈ స్వీట్‌నుతీసుకుని విసిరికొట్టింది. పెళ్లి కొడుకు బిత్తరపోయాడు.. తర్వాత పెళ్లికొడుకుకు పెళ్లికూతురు పాయసం తాగేంచే ప్రయత్నం చేసింది. అతడికి మాత్ర కోపం రాదా ఏమిటి? అతడికి వచ్చింది.. ఆ పాయసాన్ని కింద పారపోశాడు. దాంతో పెళ్లి కూతురుకు కోపం నషాళానికి అంటింది. ఆ గ్లాస్‌ను విసిరిపడేసింది. పెళ్లి వేడుకను కనులారా చూద్దామని వారికి ఇదో ఎంటర్‌టైన్‌మెంట్‌ అయ్యింది. ఏదో సినిమా చూస్తున్నట్టు కేకలు పెడుతూ, ఎంజాయ్‌ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రిసెప్షన్ రోజే సీన్‌ ఇలా ఉంటే రాబోయే రోజుల్లో భార్యాభర్తల ఫైటింగ్ ఏ స్థాయిలో ఉంటుందోనని కొందరు అనుమానపడుతున్నారు. అబ్బే ఈ కోపం పాలపొంగులాంటిదేనని, చప్పున చల్లారిపోతుందని కొందరు అంటున్నారు.

Updated On 30 Jun 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story