కొత్త పెళ్లి కొడుకు బెట్టు చేసి గొంతెమ్మ కోరికలు కోరితే భయపడిపోయి అతడు అడిగినవన్ని ఇచ్చేయడానికి ఇవేం పాత రోజులు కావు. నవతరం అమ్మాయిలకు ఆత్మ గౌరవం మెండు! కట్నకానుకలను డిమాండ్‌ చేస్తున్నవారికి దూరంగా ఉంటున్నారు.

కొత్త పెళ్లి కొడుకు బెట్టు చేసి గొంతెమ్మ కోరికలు కోరితే భయపడిపోయి అతడు అడిగినవన్ని ఇచ్చేయడానికి ఇవేం పాత రోజులు కావు. నవతరం అమ్మాయిలకు ఆత్మ గౌరవం మెండు! కట్నకానుకలను డిమాండ్‌ చేస్తున్నవారికి దూరంగా ఉంటున్నారు. ఇదంతా ఎందుకు చెపాల్సి వస్తున్నదంటే ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) అజమ్‌గఢ్‌లో ఓ నవ వధువు ఇలాంటి ధైర్యాన్నే కనబర్చింది. అసలు జరిగిందేమిటంటే.. ఉత్తరప్రదేశ్‌లోని తురక్‌వలీ గ్రామం నుంచి మగపెళ్లివారు ఊరేగింపుగా ఆలమ్‌పురి(Alampuri) గ్రామానికి చేరుకున్నారు.

అమ్మాయి తరపువారు వారికి ఘనమైన స్వాగత సత్కారాలను అందించారు. ఆ రాత్రి పెళ్లి జరిగింది. ఆ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు వరుడికి బంగారు ఉంగరం, గొలుసు(Dowry) ఇచ్చుకోలేకపోయారు. కొంత సమయం కావాలని అభ్యర్థించారు. వరుడికి మాత్రం పట్టరాని కోపం వచ్చేసింది. కల్యాణ మండపం నుంచి బయటకు వచ్చి రెడీగా ఉన్న కారులో ఎక్కి కూర్చున్నాడు. భర్త వెంటే భార్య కాబట్టి ఆమె కూడా వచ్చి కారులో కూర్చుంది.

కారు నెమ్మదిగా వరుడి ఇంటివైపు బయలుదేరింది. కాసేపయ్యాక అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు కొత్త పెళ్లికొడుకు. తాము అమ్మాయితో పాటు తిరిగి వెనక్కి వచ్చేస్తున్నామని చెప్పాడు. చెప్పినట్టే వధువు ఇంటికి చేరుకున్న వరుడు తనకు ఇస్తానన్న బంగారు ఉంగరం, గొలుసు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ఉభయ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ అంతా చూసిన అమ్మాయికి వరుడు మీద అసహ్యం కలిగింది. తాను అత్తారింటికి వెళ్లనుగాక వెళ్లను అని చెప్పేసింది.

అమ్మాయి ఈ మాత్రం సాహసాన్ని కనబర్చడంతో బంధువులకు, తల్లిదండ్రులకు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. వరుడితో పాటు అతడి తండ్రిని, మరో బంధువును తాళ్లతో కట్టేశారు. తాము పెళ్లి కోసం ఖర్చు పెట్టిన ఆరు లక్షల రూపాయలను తిరిగి ఇచ్చేంత వరకు వదిలేది లేదని చెప్పేశారు. విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పంచాయితీ జరిగింది. తర్వాత పెళ్లికొడుకు తరపువారు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తీసుకున్న కానుకలను తిరిగి ఇచ్చేశారు. ఆడపెళ్లివారు ఖర్చు చేసిన దానిలో లక్షా 90 వేల రూపాయలు తిరిగి ఇచ్చారు. మొత్తం మీద పెళ్లి క్యాన్సల్ అయ్యింది.

Updated On 30 May 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story