పసిడి ప్రేమికులకు ఓ శుభవార్త! బంగారం(Gold) ధర మరికొంత తగ్గింది. తులం బంగారం ధర 62 వేల రూపాయల కంటే తక్కువే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై 300 రూపాయలు తగ్గి 55, 800 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 330 రూపాయలు తగ్గి 60, 870

పసిడి ప్రేమికులకు ఓ శుభవార్త! బంగారం(Gold) ధర మరికొంత తగ్గింది. తులం బంగారం ధర 62 వేల రూపాయల కంటే తక్కువే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై 300 రూపాయలు తగ్గి 55, 800 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 330 రూపాయలు తగ్గి 60, 870 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు 1,964.4 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు 200 రూపాయలు తగ్గి 74, 300 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి 78 వేల రూపాయలుగా ఉంది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,020 రూపాయలు, 22 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర 55,950 రూపాయలు. చెన్నైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,360 రూపాయలు కాగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,250 రూపాయలు. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800 రూపాయలు , 24 క్యారెట్ల బంగారం ధర 60,870 రూపాయలుగా ఉంది.

Updated On 19 May 2023 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story