Gold Price Cheap : బంగారం భలే చీప్.. తులం బంగారం ఎంతనుకుంటున్నారు.?
బంగారం అంటే మనకెంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసేవాళ్లు చాలా మంది! మహిళలకు బంగారు ఆభరణాలంటే మోజు. ఇప్పుడు తులం బంగారం అర లక్ష దాటింది. కొనాలంటే గుండె గుభేలుమంటోంది.
బంగారం అంటే మనకెంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసేవాళ్లు చాలా మంది! మహిళలకు బంగారు ఆభరణాలంటే మోజు. ఇప్పుడు తులం బంగారం అర లక్ష దాటింది. కొనాలంటే గుండె గుభేలుమంటోంది. మన కంటే అరబ్ కంట్రీలలో తక్కువ ధరకు లభిస్తున్నది కాబట్టే ఆ దేశాల నుంచే గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ సంగతి అలా ఉంచితే ఇండియన్స్‌కు గోల్డ్ మీద ఉన్న ఆసక్తిని గమనించిన భూటాన్ దేశం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఫుయంషోలింగ్, థింపులకు వచ్చేవారు ఎలాంటి ట్యాక్స్ లేకుండానే బంగారం కొనుగోలు చేసేందుకు అనుమతిస్తోంది.
భూటాన్ దేశ నూతన సంవత్సరం, భూటాన్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 21న ఈ నిర్ణయం తీసుకుంది. భూటాన్‌లో తులం బంగారం ఎంతనుకుంటున్నారు? అక్కడి కరెన్సీలో 38 వేల భూటనీస్ ఎన్‌గూల్ట్రమ్‌కు అటూ ఇటూగా ఉంది. ఒక్క బీటీఎన్ మన రూపాయితో సమానంగానే ఉంది. అంటే భూటాన్‌లో 37,588 రూపాయలకే తులం బంగారం దొరుకుతుందన్న మాట! అక్కడ్నుంచి గోల్డ్ తెచ్చుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. మనం అక్కడ పన్ను రహిత బంగారం కొనాలంటే సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది రెండు వేల లోపే ఉంటుంది. గత సంవత్సరం నుంచి ఈ ఎస్‌డీఎఫ్ టూరిజం ట్యాక్స్ అమలులోకి వచ్చింది. భారతీయులు ఒక వ్యక్తి ఒక రోజుకు 12 వందల నుంచి 18 వందల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇతర దేశస్తులు అయితే 65 నుంచి 200 డాలర్ల వరకు చెల్లించాలి. ఈ ఎస్‌డీఎఫ్ ట్యాక్స్ కట్టిన వారు మాత్రమే ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనేందుకు అర్హులు. ఈ బంగారాన్ని లగ్జరీ వస్తువులు విక్రయించేడ్యూటీ ఫ్రీ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయొచ్చు.అలాగే ఆ దేశ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్‌లో ఓ రాత్రి బస చేయాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి కిలోలకు కిలోలకు తెచ్చుకుంటామంటే అది కుదరని పనే!మగవాళ్లైతే 50 వేల రూపాయల విలువైన బంగారం. మహిళలు అయితే లక్ష రూపాల విలువైన బంగారం తెచ్చుకోవచ్చు. అంతకు మించి తెస్తే మాత్రం కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది