మర్యాద మన్ననలకు గోదారోళ్లను మించినవారుండంటారు..అనడం కాదు, నిజం కూడా ! వారి మర్యాదలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసమైనా గోదావరి జిల్లాలకు వెళ్లిరావాలి.. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే సకల మర్యాదలు చేసి పంపిస్తారు.. తీయని ఆతిథ్యమిస్తారు. ఇక కొత్త అల్లుడు వస్తే ఇంకేమైనా ఉందా? అపారమైన వారి ప్రేమాభిమానాలను తట్టుకోవడం కష్టమే...ఈ ఇంట్రో ఎందుకు చెబుతున్నానంటే సంక్రాంతి పండుగప్పుడు కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. అసలే సంక్రాంతి పండుగ.. అందులోనూ అల్లుడిగారి రాక. గమ్మున ఉంటారా […]
మర్యాద మన్ననలకు గోదారోళ్లను మించినవారుండంటారు..అనడం కాదు, నిజం కూడా ! వారి మర్యాదలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసమైనా గోదావరి జిల్లాలకు వెళ్లిరావాలి.. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే సకల మర్యాదలు చేసి పంపిస్తారు.. తీయని ఆతిథ్యమిస్తారు. ఇక కొత్త అల్లుడు వస్తే ఇంకేమైనా ఉందా? అపారమైన వారి ప్రేమాభిమానాలను తట్టుకోవడం కష్టమే...ఈ ఇంట్రో ఎందుకు చెబుతున్నానంటే సంక్రాంతి పండుగప్పుడు కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. అసలే సంక్రాంతి పండుగ.. అందులోనూ అల్లుడిగారి రాక. గమ్మున ఉంటారా చెప్పండి.. అల్లుడికి 379 రకాల వంటకాలతో విందుభోజనం వడ్డించారు. ఏలూరు నగరం దొంగల మండపానికి చెందిన భీమారావు, చంద్రలీల దంపతులు.. లాస్టియర్ ఏప్రిల్ లో అనకాపల్లికి చెందిన మురళీకి తమ కుమార్తెనిచ్చి వివాహం చేశారు. పెళ్లి అయిన తరువాత వచ్చిన తొలి సంక్రాంతి ఇదే కావడంతో పండక్కి కూతురు, అల్లుడిని ఆహ్వానించారు. కనీ వినీ ఎరుగని రీతిలో అతిథి మర్యాదలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 379 రకాల వంటకాలను సిద్ధం చేశారు. వంటకాలన్నింటినీ డైనింగ్ టేబుల్ నిండా పెట్టి.. అల్లుడు, కూతురుని భోజనానికి పిలిచారు. ఇంకేముంది.. వాటన్నింటినీ చూసి అల్లుడికి కడుపు నిండిపోయింది. అయినప్పటికీ వదల్లేదు. దంపతులిద్దరూ అటు అల్లుడు, ఇటు కూతురికి కొసరి కొసరి తినిపించారు. అరిటాకులో పిండివంటలు, కూరలు, వేపుళ్లు, పప్పులు, స్వీట్లు, పండ్లు, కారప్పొడులు, వివిధ రకాల పచ్చళ్లు, శీతల పానీయాలు.. అబ్బో ఇంకా చాలా చాలా ఉన్నాయండి బాబూ! మనక్కూడా కడుపు నిండిపోయింది కదూ!