Global Star Ram Charan Grand Welcome : గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌కి ఘనస్వాగతం.. ఆనందంలో ఫ్యాన్స్.!
ఒక్కోసారి కొందరు సాధించే ఘనవిజయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఊహకు కూడా అందవు. అటువంటిదే రామ్ చరణ్ సాధించిన అసాధారణమైన విజయం. జస్ట్ కెరీర్ మొదలైన 15 ఏళ్ళలో జాతీయస్థాయి దాటి, గ్లోబల్ రేంజ్‌ని అందుకోవడం కేవలం రామ్‌చరణ్‌కి మాత్రమే సాధ్యమైందనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Global Star Ram Charan Grand Welcome
ఒక్కోసారి కొందరు సాధించే ఘనవిజయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఊహకు కూడా అందవు. అటువంటిదే రామ్ చరణ్ సాధించిన అసాధారణమైన విజయం. జస్ట్ కెరీర్ మొదలైన 15 ఏళ్ళలో జాతీయస్థాయి దాటి, గ్లోబల్ రేంజ్‌ని అందుకోవడం కేవలం రామ్‌చరణ్‌కి మాత్రమే సాధ్యమైందనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి కొడుకే అయినా ఆ ఆభిజాత్యం, అహంకారం, తలబిరుసుతనం వంటివి రామ్ చరణ్‌లో ఏ కోశాన కనిపించవు. ఎంతో హుందాగా ఉంటూ, వయసు చిన్నదే అయినా కూడా చాలా గంభీరంగా ఉంటూ అందరితో చూడముచ్చటగా ప్రవర్తించే రామ్ చరణ్‌కి ఇప్పుడు లభించిన ఈ స్థాయి మరింత విలువైన ఇమేజ్‌ని తెచ్చింది.
ఎంత పెద్ద హిట్ వచ్చినా సరే అతి సామాన్యంగా కనిపించే చరణ్ అస్కార్ స్థాయికి ఎదిగినా అదే వినయం. కేవలం రెండు మూడు సినిమాలకే కొమ్ములొచ్చి, విచక్షణా రహింతంగా, తారతమ్యాలు మరచిపోయిన విర్రవీగిపోతున్న ఈ తరంలో రామ్ చరణ్ ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మగధీరతోనే ఇండస్ట్రీ హిట్‌ను సాధించి, చిత్రచిత్రానికి ఎదుగుతూ, మరో వైపు మెగాస్టార్ రేంజ్‌కి తగినట్టుగా ఉంటూ, ఈ రోజున ట్రిపులార్ చిత్రంతో ప్రపంచస్థాయి గుర్తింపుని కైవశం చేసుకున్నారు. గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడికెళ్ళినా రెడ్ కార్పెట్ వెల్‌కమే ఎదురయ్యింది. ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు, వీడియో బైట్‌లతో రామ్‌చరణ్‌ని అందరూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆస్కార్ వేడుకలను ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన చరణ్‌కు అపురూపస్వాగతం లభించింది.
ముఖ్యంగా, జాతీయ ఛానెల్ ఎన్డీటీవి జరిపిన ట్రిపులార్ మూవీ ఎంక్లేవ్‌కి రామ్ చరణ్ గెస్ట్‌గా పాల్గొనడం, ఆస్కార్ ట్రిప్ పూర్తి చేసుకొచ్చిన అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు అన్నిటినీ అందులో పంచుకోవడం మరో విశేషం. రాజ్‌దీప్‌తో జరిగిన ఈ ముచ్చటలో రామ్ చరణ్ ప్రతీ మాటలో తానొక భారతీయుడనని మాత్రమే చెప్పారు. భారతీయ చిత్రపరిశ్రమను గౌరవిస్తూ, అందులో తానూ ఒక భాగమని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.. యూ ఆర్ గ్రేట్ రామ్ చరణ్. కీపిటప్.
