ఈ రోజుల్లో మగపిల్లలకు పెళ్ళిళ్లు అవటం కష్టం గా మారింది. రెండు దశాభ్దాల క్రితం వరకు అయితే ఆడపిల్ల గుండెలమీద కుంపటి అని వ్యాఖ్యానించేవారు. ఇప్పడు మగపిల్లవాడు తల్లి తండ్రులకు గుదిబండగా మారాడు. కారణాలు ఏమైనా ఇంట్లో ఏ శుభకార్యం లేకుండా వంశాభివృధ్ది లేకుండా మగపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ రోజుల్లో మగపిల్లలకు పెళ్ళిళ్లు అవటం కష్టం గా మారింది. రెండు దశాభ్దాల క్రితం వరకు అయితే ఆడపిల్ల గుండెలమీద కుంపటి అని వ్యాఖ్యానించేవారు. ఇప్పడు మగపిల్లవాడు తల్లి తండ్రులకు గుదిబండగా మారాడు. కారణాలు ఏమైనా ఇంట్లో ఏ శుభకార్యం లేకుండా వంశాభివృధ్ది లేకుండా మగపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా ఇండియా(India)లోనే అనుకుంటే పొరపాటే... పక్కనే మనకు కరోనా(Corona)ను పరిచయం చేసిన చైనా(China)లో కూడా ఇదే పరిస్ధితి అక్కడి యువకులు ఎదుర్కోంటున్నారు.

కొంతమంది యువకులకు ఐతే వధువులు దొరుకుతున్నారు కానీ చాలామందికి పెళ్లి కావటం సమస్యగానే ఉంది. మరోవైపు ఎక్కువ మంది యువకులు కెరీర్ మీద దృష్టి సారించి ధనం సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంట్లో పేరెంట్స్ ఏమో పెళ్లి చేసుకోమని ఒత్తడి చేస్తున్నారు. దీంతో పెద్దల బాధ తప్పించుకోటానికి చైనా యువకులు అద్దెకు గర్ల్ ప్రెండ్స్ ను (Girl Friend on Rent) ఏర్పాటు చేసుకుని వారితో కాలక్షేపం చేస్తున్నారుట. ఇటీవల ఒక జర్నలిస్ట్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో పలు ఆసక్తి కర విషయాలు వెలుగు చూసినట్లు చైనా పత్రికలు రాశాయి.

చైనాలో యువతీ యువకులు పెళ్లి ఈడు దాటి పోతున్నా సంపాదన కోసం పరుగులు పెడుతున్నారు. ప్రియురాలు లేని ఒంటరి యువకులు వీకెండ్స్‌, హాలీ డేస్‌ టైమ్‌లో ఇలా గర్ల్‌ఫ్రెండ్‌ను రెంట్‌కు తీసుకెళ్లడం ఇప్పుడు చైనాలో ఎక్కువైపోయిందట. చాలా రోజులుగా సీక్రెట్‌గా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఒక జర్నలిస్ట్ చేసిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో వెలుగు చూసింది.

అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్(Rent a Girlfriend) దోరుకుతున్నారని సమాచారం తెలుసుకున్న చైనా(China)లోని నాజియాంగ్ కు చెందిన జర్నలిస్ట్ తనకు తెలిసిన ఒక వెబ్ సైట్ లో లాగిన్ అయి తనకు గర్ల్ ఫ్రెండ్ కావాలని ప్రకటన ఇచ్చాడు. అది చూసి మము అని మారుపేరుతో ఉన్న ఒక యువతి wechat అనే సోషల్ మీడియా app యాప్ ద్వారా నాజియాంగ్ ను సంప్రదించింది. అతని వివరాలు తెలుసుకున్న తర్వాత అతనికి గర్ల్ ఫ్రెండ్ గా ఉండేందుకు సిధ్ధపడింది. అందుకుగాను రోజుకు ఇండియన్ కరెన్సీలో 12 వేల రూపాయలు ఇవ్వాలని కోరింది.

అందుకు అంగీకరించటంతో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ సమయంలో ఆ అమ్మాయి వద్ద నుంచి పలు ఆసక్తికర విషయాలను అతను రాబట్టాడు. ప్రస్తుతం తాను చదువుకుంటున్నానని.. ఖాళీ సమయాల్లో వేరే వారికి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటూ నెలకు సుమారు 60 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపింది. పండగలు, సెలవు దినాలలో మాములు రోజుల్లో కంటే ఎక్కువ సంపాదిస్తానని వివరించింది. బీజింగ్(Beijing) లోని ఒక వ్యక్తి తనను చాలా సార్లు అద్దెకు తీసుకుని వారి తల్లి తండ్రులకు పరిచయం చేశాడని... అతను తన తల్లితండ్రులకు ఆమె ఫోటోలు పంపించినట్లు చెప్పింది.

గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు పెళ్లిళ్లు కాకపోవటంతో వారు కూడా అద్దెకు గర్ల్ ఫ్రెండ్ సేవలను వినియోగించుకుంటున్నారుట. తద్వారా వారు తమ పరువు కాపాడుకుంటున్నట్లు ఆ యువతి వెల్లడించింది. ఖాతా దారులతో ప్రేమలో పడకూడదనేది తన ప్రాధమిక నియమమని మము చెప్పింది. ఆమెకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో క్లయింట్లు ఉన్నారని.... తాను అక్కడకు వెళ్ళటానికి అదనంగా చార్జి వసూలు చేస్తానని తెలిపింది.

కొంతమంది క్లయింట్లు తనతో పెళ్లయినట్లు ఫోటోలు తీసుకుని వాటి ద్వారా నకిలీ వివాహ ధృవీకరణ పత్రాలు పొందినట్లు చెప్పింది. చాలా మంది తన క్లయింట్‌లు తమ తల్లిదండ్రులను కలవడానికి తమతో పాటు రావాలని తనను అడుగుతారని ముము చెప్పింది. కొందరు తమతో పెళ్లి ఫొటోలు తీయమని అడుగుతుండగా, మరికొందరు పెళ్లికూతురుగా నటించమని చెప్పి వివాహ విందులు కూడా నిర్వహించారన్నది. అద్దెకు గర్ల్ ఫ్రెండ్ దొరకటం విషయమై పలువురు వ్యక్తులు మము శీలాన్ని కూడా శంకించారు. ఏవరేమనుకున్నా తాను ఇంతవరకు కట్టు దాటలేదని.... ఇంతవరకు తనకు బోయ్ ఫ్రెండ్ దొరకలేదని.... దొరికితే ఈ పని మానేస్తానని మము తెలిపింది.

Updated On 24 March 2023 4:57 AM GMT
Ehatv

Ehatv

Next Story