జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ట్రిపులార్ సినిమా ఇండియా అంత‌టా కుమ్మేసింది. విదేశాల్లో కూడా దుమ్మురేపుతోంది. ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ అవార్డులు గెల్చుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డు సాధించే దిశ‌గా వెళుతోంది.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ట్రిపులార్ సినిమా ఇండియా అంత‌టా కుమ్మేసింది. విదేశాల్లో కూడా దుమ్మురేపుతోంది. ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ అవార్డులు గెల్చుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డు సాధించే దిశ‌గా వెళుతోంది. రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగుస్థాయిని ప్ర‌పంచ వేదికల‌పై చాటిచెప్పింద‌న‌డంలో ఎలాంటి అనుమాన‌మూ లేదు. సినిమా విడుద‌లై ఏడాది అవుతోంది. అయినా ఇంకా ట్రిపులార్ జోరు అలాగే ఉంది. నాటు నాటు పాట ఆస్కార్ బ‌రిలో నిల‌వ‌డంతో హాలీవుడ్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌న్, రాజ‌మౌళి పేర్లు రీసౌండ్ చేస్తున్నాయి.

ఈనెల 13న 95వ ఆస్కార్ అవార్డులను ప్రకటిస్తారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని అంద‌రూ మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నారు. లేటెస్ట్‌గా నాటు నాటు పాట, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లపై గరికపాటి నరసింహారావు కొన్ని కామెంట్స్ చేశారు. అవి కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అచ్చ తెలుగులో రాసిన నాటు నాటు పాట‌ ఆస్కార్‌కు నామినేట్‌ కావడం త‌న‌కు అమితానందాన్ని క‌లిగించింద‌ని గ‌రిట‌పాటి అన్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ను అద్భుతంగా న‌టించార‌ని, కీర‌వాణి సంగీతం వీనుల విందుగా ఉంద‌ని వ్యాఖ్యానించిన గ‌రిక‌పాటి డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, సాంగ్ రైట‌ర్ చంద్ర‌బోస్‌ల‌ను కూడా ప్ర‌శంసించారు. గుడికెళ్లి దేవుడికి దండం పెట్టుకున్న‌ప్పుడు ట్రిపులార్ పాట‌కు ఆస్కార్ రావాల‌ని కోరుకోండంటూ గ‌రిక‌పాటి రిక్వెస్ట్ చేశారు. నాటు నాటు పాటలో ఎన్టీఆర్‌ బెల్ట్ తీస్తే రామ్‌చ‌ర‌ణ్ కూడా తీశాడు, ఆయ‌న‌ కుడికాలు తిప్పితే ఈయనా కుడికాలే తిప్పాడు. కవలలై పుట్టినవారికి కూడా ఇది అసాధ్యం, రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి నటన చేశారంటే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రశంసలతో ముంచెత్తారు గ‌రిక‌పాటి న‌ర‌సింహ‌రావు.

Updated On 9 March 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story