Bapu Bomma : తెలుగమ్మాయి-అబ్బాయిపై సోషల్ మీడియాలో సరదా సంభాషణ..
తెలుగు అమ్మాయి(Telugu girl) కనపడడం లేదు, మాయమైపోతున్న తెలుగు అమ్మాయి. ఈ మధ్య ఎవరైనా తెలుగు అమ్మాయిని చూశారా.. చూస్తే చెప్పండి ఎక్కడ ఉందో మేమూ చూస్తాం. ఇంతకీ మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలుసా.. తెలియకుంటే చెప్తాం చూడండి. మా తెలుగు అమ్మాయి అమాయకంగా ఉంటుంది. చేతి నిండా గాజులు(Bangles) వేసుకుని లక్ష్మీదేవిలా(Goddess Lakshmi) ఉంటుంది. రెండు చేతులకూ గోరింటాకుతో(Lawsonia Inermis) (మెహందీ కాదు), పాదాలకు పారాణితో అందంగా ముస్తాబవుతుంది.
తెలుగుమ్మాయి-తెలుగు అబ్బాయి గురించి సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ సరదా సంభాషణ మనం కూడా చూద్దామా..
తెలుగు అమ్మాయి(Telugu girl) కనపడడం లేదు, మాయమైపోతున్న తెలుగు అమ్మాయి. ఈ మధ్య ఎవరైనా తెలుగు అమ్మాయిని చూశారా.. చూస్తే చెప్పండి ఎక్కడ ఉందో మేమూ చూస్తాం. ఇంతకీ మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలుసా.. తెలియకుంటే చెప్తాం చూడండి. మా తెలుగు అమ్మాయి అమాయకంగా ఉంటుంది. చేతి నిండా గాజులు(Bangles) వేసుకుని లక్ష్మీదేవిలా(Goddess Lakshmi) ఉంటుంది. రెండు చేతులకూ గోరింటాకుతో(Lawsonia Inermis) (మెహందీ కాదు), పాదాలకు పారాణితో అందంగా ముస్తాబవుతుంది. మా తెలుగు అమ్మాయి నిండుగా పరికిణి కట్టుకుని, ఓణి(Half saree) వేసుకుని ఉంటుంది. తలకు చమురు రాసుకుని చక్కగా దువ్వి రెండు జడలు వేసుకోవడమే కాకుండా.. తల నిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడకుప్పులు వేసుకుంటుంది. చారడేసి కళ్లకు కాటుక(Kajal) పెట్టుకుని, నుదుటిన చంద్రబింబం లాంటి ఎర్రటి కుంకుమ బొట్టు(Bindi) పెట్టుకుంటుంది (బొట్టు బిళ్ళ కాదు). కాళ్లకు మువ్వల అందెలతో (కాలి పట్టీలు అనకూడదు) వాటి శబ్దంతో ఇల్లంతా సందడిగా తిరుగుతుంది. ముద్దబంతి పువ్వులా, ఇంట్లో దీపంలా ఇంటికి కళగా ఉంటుంది. ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? మాకైతే గత 25 ఏళ్లుగా కనిపించడం లేదు. పండక్కో, పబ్బానికో, అక్కడక్కడ తళుక్కున మెరిసి మాయమైపోతుందంతే.
దీనికి కొందరు సమాధానమిస్తూ..
తెలుగమ్మాయి ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగబ్బాయిని(Telugu guy) వెతుకుంటూ వెళ్లి తిరిగి రాలేదు. తెలుగబ్బాయి ఎవరా అని అడుగుతున్నారా.. చెప్తాం.. అంటూ.. ధైర్యంగా ముందుకు పోయే తత్వం. పంచె, లాల్చీ, కండువాలతో ఉంటాడు. నడిచొచ్చే విష్ణుమూర్తిలా(Lord Vishnu) ఉంటాడు. కోరమీసంతో(mustache), చాకులాంటి ముక్కుతో ఉంటాడు. వరసలు కలిపి అందరినీ నవ్వుతూ పలకరిస్తుంటాడు. తెలుగువారితో తెలుగులోనే (Telugu)మాట్లాడుతుంటాడు. చక్కని కుంకుమబొట్టుతో మెరిసిపోతుంటాడు. తల్లిదండ్రులను అమ్మా, నాన్నా అని నోరారా పిలుస్తాడు. అత్తా, మామా లాంటి భారతీయమైన పిలుపులే వాడుతాడు. అనవసరంగా పాశ్చాత్య భాష(English) వాడడు. అడగకుండానే తోటివారికి తోచిన విధంగా సాయం చేస్తుంటాడు. చూడటానికి రెండు కళ్లు, చెప్పడానికి మాటలూ చాలవు అన్నట్టుగా ఉంటాడు. చూసి చాలా కాలమైంది. తననే వెతుకుతూ తెలుగు అమ్మాయి వెళ్లింది. వీరిద్దరూ ఒకేసారి కలిసే వస్తారని ఆశిద్దాం