ఫ్రాన్స్‌ (france) మహిళా మంత్రి ఫోటో అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పత్రిక ప్లేబాయ్‌ కవర్‌పేజీపై దర్శనమివ్వడం వివాదాస్పదమయ్యింది. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. మహిళా మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఈ వ్యవహారంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. 40 ఏళ్ల మర్లీన్‌ షియప్పా (marlene schiappa) ఫ్రాన్స్‌ ప్రభుత్వంలో సోషల్‌ ఎకానమీ, అసోసియేషన్స్‌ శాఖను నిర్వహిస్తున్నారు.

ఫ్రాన్స్‌ (france) మహిళా మంత్రి ఫోటో అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పత్రిక ప్లేబాయ్‌ కవర్‌పేజీపై దర్శనమివ్వడం వివాదాస్పదమయ్యింది. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. మహిళా మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఈ వ్యవహారంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. 40 ఏళ్ల మర్లీన్‌ షియప్పా (marlene schiappa) ఫ్రాన్స్‌ ప్రభుత్వంలో సోషల్‌ ఎకానమీ, అసోసియేషన్స్‌ శాఖను నిర్వహిస్తున్నారు. ఈ మహిళా మంత్రి ప్లే బాయ్‌ అనే గ్లామర్‌ పత్రికలో ఫోటో షూట్‌ కోసం డిజైనర్‌ రూపొందించిన ప్రత్యేకమైన దుస్తులను ధరించారు. ఇదే విమర్శలకు దారి తీసింది. మర్లీన్‌ ఆ పత్రికకు 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మ్యాగజైన్‌పై కవర్‌ఫోటోను చూసిన ఫ్రాన్స్‌ ప్రధానమంత్రి ఎలిసాబెత్‌ బోర్నే మంత్రిని పిలిపించి మాట్లాడారు. మీరు చేసిన పని మంచిది కాదని మర్లీన్‌కు ప్రధాని చెప్పారు. పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మర్లీన్‌ మహిళలపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఆడవారు తమ శరీరాలతో ఏమైనా చేయవచ్చన్నారు. గే హక్కులు, అబార్షన్లపై తన అభిప్రాయాన్ని చెప్పారు.

ఇదిలా ఉంటే మర్లీన్‌ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో ప్రకంపనలు పుట్టించాయి. ఆమె వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అటు ప్రతిపక్షాలు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవలే మాక్ర‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన రిటైర్మెంట్ ఏజ్ ప్ర‌ణాళిక‌లపై ఒక‌వైపు భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్న సమయంలోనే మ‌ర్లీన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాయి.

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story