ఇంటర్ లో మంచి మార్కులు సంపాదించినా ఎంతో మంది డాక్టర్ (doctor)చదువుకి వెళ్లాలని ఆశ ఉంటుంది.చాలామందికి ఇది తీరని కల గా మిగిలిపోతుంది. లక్షలు ఖర్చుపెట్టి చదివే వాళ్ళు తక్కువమంది ఉంటారు. విదేశాలు(foreign) వెళ్లి చదివేవారు కొంతమంది ఉంటారు . ఇండియాలో(India) మాత్రం ఆర్థిక పరమైన ఇబ్బంది తో ఎంతో మంది డాక్టర్ చదువు కలగా మిగిలి పోతుంది ,కానీ ఇక మీదట మన ఇండియా లో ఉచితంగా వైద్య విద్యను చదవచ్చు . ఏంటి నమ్మలేకపోతున్నారా ?

ఇంటర్ లో మంచి మార్కులు సంపాదించినా ఎంతో మంది డాక్టర్ (doctor)చదువుకి వెళ్లాలని ఆశ ఉంటుంది.చాలామందికి ఇది తీరని కల గా మిగిలిపోతుంది. లక్షలు ఖర్చుపెట్టి చదివే వాళ్ళు తక్కువమంది ఉంటారు. విదేశాలు(foreign) వెళ్లి చదివేవారు కొంతమంది ఉంటారు . ఇండియాలో(India) మాత్రం ఆర్థిక పరమైన ఇబ్బంది తో ఎంతో మంది డాక్టర్ చదువు కలగా మిగిలి పోతుంది ,కానీ ఇక మీదట మన ఇండియా లో ఉచితంగా వైద్య విద్యను చదవచ్చు . ఏంటి నమ్మలేకపోతున్నారా ?

ఆర్థిక పరిస్థితి దృడంగా ఉన్న వాళ్ళకి తప్ప వైద్య విద్య (doctor course)అందరికి అందుబాటులోకి రానిది . అలంటి వారి కోసం దేశం లో నే ఉచిత వైద్య విద్యను అందించే కళాశాలను(college) ప్రారంబించారు .ఇక్కడ MBBS విద్య పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది .

ఈ వైద్య కళాశాల పేరు శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR), ఇది కర్ణాటకలోని(karnataka) ముద్దెనహళ్లి(maddenahalli) గ్రామంలో ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీఈ కాలేజీ ను ప్రారంభించారు. ఈ కళాశాల భారతదేశంలోనే (india's first free mbbs college)మొట్టమొదటి పూర్తి ఉచిత వైద్య కళాశాలగా చెప్పబడుతుంది.ఇక్కడ విద్యార్థులు హాస్టల్ మరియు ఆహారం(food) మొదలైన ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కళాశాలను ఆధ్యాత్మిక గురువు శ్రీ మధుసూదన్ సాయి(master shree madhusudan sai) రూ.400 కోట్లతో నిర్మించటం జరిగింది .అన్ని వైద్య కళాశాలల మాదిరిగానే, శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హాస్టల్స్, ఆడిటోరియంలు, సిబ్బంది వసతి మరియు క్రీడా సౌకర్యాలతో పాటు బోధనా ఆసుపత్రి అలాగే అకడమిక్ బ్లాక్‌ను వంటి అన్ని సౌకర్యాలను కలిగి ఉంది . ఇది మొత్తం 325,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది.

ఎవరైనా ఇక్కడ చదువుకోవచ్చు కానీ ఇది గ్రామీణ భారతదేశం నుండి మొదటి తరం అభ్యాసకులు(lectures) మరియు వెనుకబడిన పేద విద్యార్థుల(poor students) కోసం ప్రాంభించటం జరిగింది. వైద్య విద్యను చదువలనే మెరిట్ స్టూడెంట్స్ (merit students)డబ్బు లేక ఆగిపోతానంటారు అలంటి వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది . ఈ కళాశాలకు సంబంధించిన ఏకైక లక్ష్యం ఏమిటంటే, విద్యార్థులు తప్పనిసరిగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)లో అర్హత సాధించాలి మరియు కాలేజీ కి కేవలం ఒక జత దుస్తులతో వస్తే సరిపోతుంది మిగతాదంతా ప్రశాంతి బాలమందిర్(prashanthi mandir) చూసుకుంటుంది.జూన్ 2023-24 విద్యా సంవత్సరంలో ఈ వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి. ఇది కాకుండా, నిరుపేద పిల్లలకు ఇక్కడ ఉచిత కోచింగ్(free coaching) తరగతులు కూడా నిర్వహించబడతాయి, తద్వారా వారు ఈ కళాశాలలో ప్రవేశం పొందడానికి NEET పరీక్షను క్లియర్ చేయవచ్చు.

ఈ కళాశాలలో వైద్యులుగా చేరిన విద్యార్థులు నిరుపేదలకు సేవను అందించే దిశగా ప్రోత్సహించాపడతారు .విద్యార్థులు వైద్యులు అయిన తర్వాత పేద (poor)మరియు దిగువ తరగతి వారికి సేవ చేయాలనే లక్ష్యం తో పని చేయాలి .
ఇక్కడ ఐదేళ్లు చదివి వైద్యురాలైతే ఐదేళ్లపాటు పేదలకు సేవలందించాలని, ఆ తర్వాత వారు ఎంచుకున్న వృత్తిని(profession) చేసుకోవచ్చు అన్ని కాలేజీ యాజమాన్య నిబంధన. వైద్య విద్యను దైవం భావించే ప్రతి పేద విద్యార్థికి ఈ కాలేజీ (college)ఎంతగానో సహకరిస్తుంది .

Updated On 6 April 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story